Bigg boss 9 Telugu : భరణికి ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటు.. ఇదయ్యా మీ అసలు రూపం!
on Nov 11, 2025

పైకి ఎంత మంచిగా కనపడినా నా సొంతం అని వచ్చేసరికి కాటేస్తారు. ఫస్ట్ వీక్స్ లో భరణిని అన్నా.. అన్నా అంటూ ప్రేమగా పిలిచి నామినేట్ చేసి బయటకి పంపించాడు ఇమ్మాన్యుయల్.. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చాడు ఇమ్మాన్యుయల్. బిగ్ బాస్ సీజన్-9 పదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ హౌస్ లో మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో పదకొండు మంది ఉన్నారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియ భిన్నంగా జరిగింది.
నామినేట్ అయిన వారు గార్డెన్ ఏరియాలోని ఓ ప్లేస్ లో కుర్చీలో కూర్చుంటే పై నుండి బురద వచ్చి వారి మీద పడుతుంది. అయితే ఈ సారి నామినేషన్ కి టైమ్ ఒక అయిదు నిముషాలు మాత్రమే అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టైమ్ లోనే ఇద్దరు తమ పాయింట్స్ చెప్పుకోవాలి. మొదటగా ఇమ్మాన్యుయల్ భరణిని నామినేట్ చేసాడు.
అన్న మీరు లాస్ట్ టైమ్ గేమ్ ఆడలేదు.. అందుకే హౌస్ నుండి వెళ్లిపోయావ్.. మళ్ళీ రీఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చాక.. ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తానంటే చాలా హ్యాపీగా అనిపించింది.. మీ కళ్ళలో కూడా ఆ కసి కన్పించింది కానీ ఇప్పుడు మీలో ఎలాంటి మార్పు లేదు.. ఇప్పటికి కూడా మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడం లేదని ఇమ్మాన్యుయల్ తన పాయింట్స్ చెప్తాడు. నేను బాగానే ఆడుతున్నానని భరణి తన పాయింట్స్ చెప్తాడు.
భరణి ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడు ఇమ్మాన్యుయల్ తన దగ్గరున్న పవరస్త్రని వాడితే భరణి సేవ్ అయ్యేవాడు కానీ కానీ అలా చెయ్యకుండా భరణిని ఇమ్మాన్యుయల్ వెన్నుపోటు పొడిచాడు. అందుకే భరణి రీఎంట్రీ ఇచ్చాక.. కట్టప్ప మోసం చేసావ్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. అన్న అన్న అంటూనే భరణిని మళ్ళీ పంపించేందుకు నామినేట్ చేసాడు ఇమ్మాన్యుయల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



