Karthika deepam 2 : కాబోయే పెళ్లి కూతురు ఆర్డర్.. శివన్నారాయణ వార్నింగ్!
on Mar 21, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310 లో..... కార్తీక్ రెస్టారెంట్ కి పారిజాతం వెళ్లి జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కోసం ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తుంటారు. వాళ్ళు రాకముందే పారిజాతం వెళ్లి కార్ లో కూర్చుంటుంది. మేనేజర్ కార్తీక్ కి ఆర్డర్ గురించి చెప్తాడు. ఎవరు ఇచ్చారని కార్తీక్ అడుగగా పేపర్ పై శివన్నారాయణ అని రాసి ఉంటుంది. అది చూసి కార్తీక్ ఆశ్చర్యపోతాడు. వచ్చిందెవరని కార్తీక్ అడుగగా పేరు అడగలేదని మేనేజర్ చెప్తాడు. కార్తీక్ ఫోన్ లో పారిజాతం ఫోటో చూపిస్తూ ఈవిడేనా అని అడుగుతాడు. ఆవిడే అని మేనేజర్ చెప్తాడు. నాకు చెప్పకుండా ఎందుకు ఆర్డర్ తీసుకున్నావని మేనేజర్ ని కార్తీక్ అడుగుతాడు.
ఇప్పుడు ఏం చేద్దామని దీప అంటుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే అమౌంట్ డబుల్ ఇవ్వాలి. వెళ్లి మెనూ కనుక్కుందామని దీపని వెంటేసుకొని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు కార్తీక్. జ్యోత్స్నకి చీరలు సెలక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. పారిజాతం చూసి కంగారు పడుతుంది. సుమిత్ర చూసి రారా లోపలికి అంటుంది. ఇప్పుడు నేను సత్యరాజ్ రెస్టారెంట్ తరుపున వచ్చాను.. మీరు మెనూ చెప్తే వెళ్తానని కార్తీక్ అనగానే సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. మెనూ ఏంటని వాళ్ళు అడుగుతారు. జ్యోత్స్న ఎంగేజ్మెంట్ కి ఫుడ్ ఆర్డర్ చేసింది జ్యోత్స్న అని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న చెప్పింది చేసానని పారిజాతం అంటుంది. అంటే వాళ్ళు ఎంగేజ్ మెంట్ కి ఈరకంగా అయినా వస్తారని ఇలా చేసానని జ్యోత్స్న అనగానే.. బుద్ది లేకుండా మాట్లాడకు వాళ్ళు రావలసింది ఈ ఇంటికి ఆడపడుచుగా కేటరింగ్ గా కాదని జ్యోత్స్నపై సుమిత్ర కోపడుతుంది. కాంచనతో మాట్లాడానని దశరత్ అంటాడు. మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నాను కానీ మీరు కుటుంబంతో రండీ అని పిలవలేదు.. అందుకు మా అమ్మా ఎంత బాధపడిందో మీకేం తెలుసని కార్తీక్ అంటుంటే సుమిత్ర, దశరత్ ఇద్దరు బాధపడుతారు.
ఆధారాలు తీసుకొని వస్తాన్నానవ్ ఏమైందని దీపని సుమిత్ర అడుగుతుంది. అది వదిలేయండి అని దీప అనగానే అంటే లేవనేగా.. నాకు తెలుసు నా కూతురు తప్పు చెయ్యదని సుమిత్ర అంటుంది. దీప నా మాట విని ఆ విషయం వదిలేసింది అని దశరథ్ అనుకుంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఎందుకు వచ్చారని కార్తీక్ ని అడుగుతాడు. కాబోయే పెళ్లి కూతురు మాకు ఆర్డర్ ఇచ్చిందనగానే శివన్నారాయణ షాక్ అవుతాడు. మెను కోసం వచ్చామని కార్తీక్ చెప్తాడు. మెనూ ఫోన్ లో చెప్తాము.. జ్యోత్స్న నువ్వు లోపలికి రా అని శివన్నారాయణ కోపంగా పిలుస్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు బయటకి వస్తుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం సాధించామని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
