నిఖిల్ నయ్యర్ ఎలిమినేటేడ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ!
on Nov 15, 2025
బిగ్‌బాస్ సీజన్-9లో ఇప్పటికే పది వారాలు పూర్తయింది. ఇంకా అయిదు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఫినాలే వీక్ తీసేస్తే ఉన్నది నాలుగు వారాలు మాత్రమే కానీ హౌస్‌లో ప్రస్తుతం పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే. అయితే అది ఈ వారమేనని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఈ వారం ఇమ్మాన్యుయల్ మినహా పది మంది నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కన్ఫమ్ చేశారు బిగ్ బాస్.
నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ నయ్యర్ ని ఎలిమినేట్ చేసిన నాగార్జున. మిగిలిన వాళ్ళు ఇంకా నామినేషన్ లో ఉన్నారని సండే ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. కంటెంట్ ఇవ్వడంలో నిఖిల్ ఫెయిల్ కావడంతో పాటు ఓటింగ్ పరంగా కూడా నిఖిల్, గౌరవ్ ఇద్దరూ చాలా లీస్ట్ లో ఉన్నారు. టాస్కుల్లో ఇంపాక్ట్ చూపలేకపోవడం, తెలుగులో బాగా మాట్లాడలేకపోవడం, హౌజ్ లో సైలెంట్ గా ఉండటం, ఎంటర్ టైన్ చేయకపోవడం ఇవన్నీ నిఖిల్ ఎలిమినేషన్ కు దారి తీసాయి. గత వారం నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చినప్పటికీ, నిఖిల్ ఎలాంటి మార్పు చూపించలేదు. ప్రస్తుతం హౌజ్ లో పదకొండు మంది ఉండగా శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు.. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ జరగాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



