ఓజి తర్వాత అవిటివాడినైపోతే బాగుండనుకున్నా..నా వైబ్ స్టూడియోలో పవన్ సాంగ్ పాడారు
on Nov 15, 2025
ఈ వారం ఫామిలీ స్టార్స్ షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. థమన్ పుట్టినరోజు వేడుకను ఈ షోలో నిర్వహించారు. ఇక ఈ షోలో ఒక్కో పోస్టర్ గురించి థమన్ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన "ఓజి" మూవీ పోస్టర్ పడేసరికి స్టేజి మీద ఉన్న వాళ్లంతా ఫుల్ అరుపులు కేకలు పెట్టారు. "త్రిగణన దూత అని కాదు తిరగని గుడి అంటూ ఏమీ లేదు ఈ సినిమా కోసం ఈ సీనే ఫస్ట్ సీన్ గా మూవీలో చూసాను. ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా అవిటివాడిని ఐపోయినా పర్లేదు అనుకున్నాను. మీసం తిప్పడాలు ఇవన్నీ నాకు తెలుసు. ఏమన్నా ఫెయిల్ ఐతే గడ్డం లేకుండా తిరగాలి అని నాకు తెలుసు. సుజిత్ మేకింగ్ మీద నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఐనా ఎలా ఉన్నాడో చూడండి అసలు పోస్టర్ లో. వాషి యో వాషి సాంగ్ పాడుతున్నంత సేపు ఆయన కత్తి తిప్పుతూనే ఉన్నారు. దాంతో ఆయనకు దగ్గరగా ఎవరూ వెళ్ళలేదు. వైబ్ అనే ఒక కొత్త స్టూడియో స్టార్ట్ చేసాను. అందులో ఒక యాక్టర్ వచ్చి పాడటం ఫస్ట్ టైం. ఈ స్టూడియోలో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ని రికార్డు చేసాను. నేను మణి గారి వర్క్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పాటలు పాడేవారు. గిల్లి-గిల్లి-గిల్లి అనే సాంగ్ ని ఆయన నా దగ్గరే పాడారు. మేమిద్దరం చాలా లాంగ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా బిఫోర్ ఓజి, ఆఫ్టర్ ఓజి నాకు. ఈ మూవీ నాకు ఒక ఎక్సయిట్మెంట్ ఇచ్చింది." అని చెప్పుకొచ్చాడు థమన్. "లాలిక కదలిక..ఓజాస్ గంభీర " అంటూ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఎలివేషన్స్ మాములుగా లేవు. ఇక ఈ మ్యూజిక్ ఇప్పటికీ టాప్ సాంగ్ గా ట్రెండింగ్ లో ఉంది. ఆడియన్స్ కి నచ్చేలా బిజీఎంని, సాంగ్స్ ని కంపోజ్ చేశారు థమన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



