పెళ్ళిమండపంలో గంగ.. బాక్సింగ్ ఛాంపియన్ కాగలదా!
on Nov 15, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -114 లో......గంగ కోసం రుద్ర అకాడమీలో కోచ్ వెయిట్ చేస్తాడు. అప్పుడే ఒకావిడ వచ్చి గంగ రాదు సర్ తన మ్యారేజ్ అని చెప్తుంది. అయ్యో ఇప్పుడు గంగ రాకుంటే ఎలా అని అతను కంగారుపడతాడు. అప్పొజిట్ పోటీ పడే అమ్మాయి వచ్చి నాతో పోటీ పడడానికి భయపడి ఇలా తప్పుకుంటున్నారా అని పొగరుగా మాట్లాడుతుంది. మరొకవైపు రుద్రని పెళ్లి కొడుకుని చేస్తారు.
ఈ పెళ్లి ఎవరికి ఇష్టం లేదు అన్నయ్య అని రుద్రతో ప్రీతి చెప్తుంది. అంతా ఆ స్వామి చెప్పినప్పటి నుండి ఇలా పెద్దమ్మ మారిపోయిందని స్వామి వచ్చి చెప్పింది రుద్రకి స్నేహ చెప్తుంది. నువ్వు ఎక్కడ గంగని పెళ్లి చేసుకుంటావోనని పెద్దమ్మ మారిపోయిందని స్నేహ అంటుంది. చెప్పాలంటే పారు కంటే గంగ బెటర్ అని వంశీ అంటాడు. ఆ పారు ఈ ఇంటికి కోడలు అయ్యాక నిన్ను మా నుండి దూరం చేస్తుందేమోనని భయంగా ఉందని రుద్రని పట్టుకొని ప్రీతీ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ఇషిక వచ్చి అమ్మాయికి అప్పగింతలు చేస్తారు.. అబ్బాయికి కాదని అంటుంది. నువ్వు మీ అన్నయ్య కలిసి బాధ్యతగా పెళ్లి చేస్తున్నారు కదా అని ఇషికతో ప్రీతీ కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత పారుని పెళ్లి కూతురు చేసే దగ్గరికి శకుంతల తన ఫ్రెండ్స్ తో వెళ్తుంది. తన దగ్గరికి వెళ్లి పారుకి పరిచయం చేస్తుంది.
ఆ తర్వాత గంగని పెళ్లి కూతురు చేస్తారు. ఆ తాగుబోతోడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నారని అక్కడికి వచ్చిన మహిళలు అంటారు. అయిన ఎవరు చేసుకుంటారులే అని మళ్ళీ వాళ్లే అంటారు. అప్పుడే లక్ష్మీ కళ్ళు తిరిగిపడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్దామని గంగ అంటుంది. వద్దు ఇదంతా పెళ్లి ఆపడానికి ప్లాన్ అని పైడిరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



