
యూట్యూబర్ నందన మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వివాదాలు, కేసులతో వార్తల్లో ఉన్న ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. 28 రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయని ఆమె పేర్కొనడం ఆసక్తిని పెంచుతోంది.
‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నందన తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. అక్టోబర్ 4న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. గత 28 రోజులు తనకు ఎన్నో విషయాలను నేర్పించాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, బాధను అనుభవించానని చెప్పారు.
అయితే తాను చేదు అనుభవాలతో వెనుదిరగలేదని.. విలువైన పాఠాలు, ధైర్యం, ఆశతో తిరిగి వచ్చానని నందన రాసుకొచ్చారు. నిజాయితీగా ఉండే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని, సత్యానికి ఇంకా విలువ ఉందని తన అనుభవం ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన విలువలను వదులుకోకూడదని ఆమె సందేశమిచ్చారు.
దసరా సందర్భంగా కూడా నందన ఓ ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయని పేర్కొన్నారు. తన జీవితంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కాగా, లండన్‌లో ఉద్యోగాలు, వీసాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ నందన, ఆమె భర్త మధుకర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో నందన హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో పోలీసులు ఆమెను అదుపులోకి విచారణ జరిపారు.
మొత్తానికి గత కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో ఉంటున్న నందన.. ఇప్పుడు తన పోస్ట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇది కూడా చదవండి: ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. సీజేపీ ధర్నాలో ఉద్రిక్తత.. పోలీసులపై నటి ఫైర్.!
[YouTuber Nandana Case, Nandu World Case, Nandana Viral Post, Nandana Instagram, YouTuber Nandana, Nandu World, Telugu News]





