
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత కొరటాల శివతో కలిసి పనిచేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. దర్శకులు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ ఇద్దరూ బాలయ్యకు కథలు వినిపించారట. దీంతో వీరిద్దరిలో బాలకృష్ణ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఈసారి ఎలాంటి కథతో వస్తారన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో డిసెంబర్ 24న విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత బాలయ్య తన 112వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణతో కొరటాల శివ సినిమా చేయడం ఇదే తొలిసారి.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే బాలయ్య తదుపరి సినిమా విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. బాలయ్యను కొత్త తరహా పాత్రలో చూపిస్తూ.. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకూ ప్రాధాన్యం ఇచ్చి అనిల్ రావిపూడి మెప్పించారు.
ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా చేసేందుకు ఆయన ఓ కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అనిల్ ప్రస్తుతం వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ పేరు కూడా బాలయ్య తర్వాతి సినిమాల జాబితాలో వినిపిస్తోంది. ఇటీవలే ఆయన బాలకృష్ణకు ఓ పవర్‌ఫుల్ కథ వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య నుంచి సానుకూల స్పందన రావడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఒకవైపు ‘భగవంత్ కేసరి’తో బాలయ్యకు విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి.. మరోవైపు మాస్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్. ఇద్దరూ బాలకృష్ణతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: చివరికి గెలిచేది నిజమే.. 28 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన యూట్యూబర్ నందన.!
[Balakrishna Next Movie, Balakrishna Anil Ravipudi Movie, Balakrishna Harish Shankar Movie, NBK112 Movie, Dada Movie, Anil Ravipudi, Harish Shankar, Telugu Film News]






