
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుటుంబానికి చెందిన నటి జైన్ మేరీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలో పాల్గొన్న ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విడుదలైన తర్వాత తన శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
‘‘మమ్మల్ని మరీ ఎక్కువగా భయపెట్టాలని చూడకండి.. అలా చేస్తే మాలో భయం అనేదే లేకుండా పోతుంది’’ అంటూ జైన్ మేరీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. అక్టోబర్ 10న ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనకు పలువురు మద్దతు తెలిపారు. ఈ నిరసనలో నటి జైన్ మేరీతో పాటు నటుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన స్నేహితురాలు లేఖా వాషింగ్టన్ కూడా పాల్గొన్నారు. అయితే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని, కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు.
అనంతరం జైన్ మేరీ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో చేతులు, వేళ్లు, కాళ్లపై ఉన్న గాయాల గుర్తులను చూపించారు. తమను భయపెట్టే ప్రయత్నాలు చేయొద్దని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: బాలయ్య 100 కోట్ల ప్యాలెస్.. ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే.!
[Zayn Marie Injured, Zayn Marie Injury Video, Aamir Khan Niece Zayn Marie, Aamir Khan, Zayn Marie, Imran Khan, CJP Protest, Telugu News]




