Home

»

Latest News

పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనండి.. నరేశ్ షాకింగ్ కామెంట్స్.!

Oct 12, 2026 2:57PM

పెళ్లి చేసుకోవడం కరెక్టా? కాదా? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. కొందరు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుంటే.. మరికొందరు లివింగ్ టుగెదర్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇంకొందరు మాత్రం పెళ్లి ఊసే వద్దనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నటుడు వీకే నరేశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని మాత్రం కనండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, వీకే నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే వినోదాత్మక కథతో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వీకే నరేశ్.. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, బంధాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం సరైనదా? కాదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా రెండూ కరెక్టేనని అన్నారు. లివింగ్ టుగెదర్ కూడా తప్పు కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు ఒక ఈవెంట్‌లా మారిపోయాయని నరేశ్ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని, ఆ తర్వాత విడాకుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని అన్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని నరేశ్ అభిప్రాయపడ్డారు. రూరల్ సొసైటీలో పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. చాలామందికి సంబంధాలు కుదరడం లేదని అన్నారు.

చివరగా.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదని, పిల్లల్ని మాత్రం కనాలని సలహా ఇచ్చారు. ‘క్రేజీ కళ్యాణం’ ఈవెంట్‌లో నరేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రయాణం.. అల్లు అరవింద్ మనసులో మాట.!

 

 

 

[VK Naresh Shocking Comments, VK Naresh Marriage Comments, Crazy Kalyanam Trailer, Crazy Kalyanam Movie, VK Naresh Speech, Anupama Parameswaran, Tharun Bhascker, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com