Home

»

Latest News

AA23 ఆగిపోయిందా: ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్.!

Oct 12, 2026 3:18PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘AA23’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవల రకరకాల వార్తలు వినిపించాయి. స్క్రిప్ట్ విషయంలో అల్లు అర్జున్ సంతృప్తిగా లేరని.. దీంతో సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ కథ అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకు వెళ్లిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.

అయితే తాజాగా లోకేష్ కనగరాజ్ చేసిన ఓ పోస్ట్ ఈ గాసిప్స్‌కు తెరదించింది. అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన లోకేష్.. “ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయి” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. దీంతో 'AA23' ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్.. ఈ ముగ్గురి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో ఉంది.

ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్త ఫ్యాన్స్ కి నిరాశ కలిగించింది. అయితే తాజాగా లోకేష్ ట్వీట్ తో అందరిలో ఉత్సాహం తిరిగొచ్చింది. త్వరలో అప్‌డేట్స్ వస్తాయని దర్శకుడు లోకేష్ స్వయంగా చెప్పడంతో.. ఆ అప్‌డేట్స్ ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. 

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనండి.. నరేశ్ షాకింగ్ కామెంట్స్.!

 

 

 

[AA23 Latest Update, Lokesh Kanagar Tweet, AA23 Shelved News, Allu Arjun Next Movie, AA23 Movie, Allu Arjun, Lokesh Kanagaraj, Anirudh Ravichander, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com