Home

»

Latest News

పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రయాణం: అల్లు అరవింద్ మనసులో మాట.!

Oct 12, 2026 2:08PM

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ప్రయాణం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక లేఖ రాశారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా విడుదలై మూడు దశాబ్దాలు పూర్తయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. సినిమాలకు అతీతంగా సమాజం కోసం ఆయన చేస్తున్న కృషిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.

“మనిద్దరం కలిసి చేసిన తొలి సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యంతో పాటు షాక్‌కు గురయ్యాను” అంటూ అల్లు అరవింద్ తన లేఖను ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ సాగించిన ప్రయాణాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించారు. 30 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎంచుకునే మార్గం ఏదైనా.. అందులో మరిన్ని విజయాలు, సంతృప్తి లభించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా సమాజం పట్ల పవన్‌కు ఉన్న విస్తృతమైన దృక్పథాన్ని, సినిమాలకు మించి ఆయన చేస్తున్న సేవలను అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“సమాజం పట్ల మీకున్న విస్తృతమైన దృక్పథాన్ని, సినిమా రంగానికి అతీతంగా మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు. మరోసారి అభినందనలు తెలియజేస్తూ.. పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడూ తన ప్రేమ, ఆశీస్సులు ఉంటాయని లేఖలో తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం 1996లో విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రారంభమైంది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. 

ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి vs హరీష్ శంకర్.. బాలయ్యతో సినిమా కోసం దర్శకుల పోటీ.!

 

 

 

[Pawan Kalyan 30 Years in Cinema, Pawan Kalyan First Movie, Akkada Ammayi Ikkada Abbayi, Pawan Kalyan, Allu Aravind, Geetha Arts, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com