Home

»

Latest News

విజయ్ సేతుపతి 'బత్తా' తెలుగులోకి.. అట్లీ ఇచ్చిన క్రేజీ అప్‌డేట్!

Oct 6, 2026 10:56AM

 


మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి సినిమా రిలీజ్ రోజు  తెలుగులో కూడా కట్ అవుట్, బ్యానర్స్ కనపడతాయి. ఉప్పెన లో నెగిటివ్ రోల్ చేసినా అదే తంతు. ఇక ప్రీవియస్ చిత్రాలు మహారాజ, సార్ మేడమ్ తో అయితే తన రేంజ్ పెంచుకున్నాడు. ఎంతలా అంటే రీసెంట్ గా తమిళనాట 'బత్తా' అనే మూవీతో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేయమని తెలుగు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అట్లీ ని అడిగే పరిస్థితి. ఎందుకంటే అట్లీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. మరి ఆ పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

 'బత్తా' అక్టోబర్ 1,న తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధిస్తూ, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది. బాలాజీ తరుణీధరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ విభిన్నమైన పీరియాడికల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాకు స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రెజెంటర్‌గా, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడంతో విడుదల ముందే భారీ ఆసక్తి నెలకొంది. తమిళంలో ఈ సినిమా సాధిస్తున్న విజయాన్ని చూసి పరవశించిపోయిన సౌత్ సినిమా అభిమానులు, దీనిని తెలుగులో కూడా విడుదల చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అభిమాని పెట్టిన పోస్టుపై స్వయంగా స్పందించిన దర్శకుడు అట్లీ, "త్వరలోనే వస్తుంది అన్నయ్యా" అంటూ తెలుగు ప్రేక్షకులకి  గుడ్ న్యూస్ అందించారు. నిజానికి తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, స్థానిక పోటీ కాస్త ఎక్కువగా ఉండటంతో కేవలం హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో ఒరిజినల్ వెర్షన్ ప్రదర్శించారు. ఇప్పుడు తెలుగు వెర్షన్  కోసం డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేయడానికి పక్కా సన్నాహాలు చేస్తున్నారు.   

ఇది కూడా చదవండి: నమ్మకం సడలుతోందా:పెద్ద సినిమాల రిలీజ్ డేట్లపై అసలు ప్రాబ్లెమ్ ఎక్కడ!

 

కేవలం తెలుగు రిలీజ్ అప్‌డేట్‌తో మాత్రమే ఆగకుండా, ఇటీవల జరిగిన ‘బత్తా’ సక్సెస్ మీట్‌లో అట్లీ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. "గతంలో సౌత్ కొరియన్ చిత్రం 'పారాసైట్' ఆస్కార్ వేదికపై సంచలనం సృష్టించినట్లే, విజయ్ సేతుపతి 'బత్తా' చిత్రాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ బరిలోకి తీసుకెళ్లాలనేదే నా ప్రధాన లక్ష్యం" అని అట్లీ ధీమా వ్యక్తం చేశారు. చిన్నతనంలో తాను దళపతి విజయ్‌తో సినిమా తీస్తానని చెప్పినప్పుడు, అలాగే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో 1000 కోట్ల భారీ వసూళ్లు సాధించే హిందీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ (జవాన్) తీస్తానని ప్రపోజ్ చేసినప్పుడు అందరూ ఎగతాళిగా నవ్వారని అట్లీ గుర్తు చేసుకున్నారు. కానీ కష్టపడి తాను అనుకున్న ప్రతీ మాటను నిజం చేసి చూపించానని, ఇప్పుడు కూడా కచ్చితంగా ఆస్కార్ సాధించి చూపిస్తానని స్పష్టం చేశారు. 

ఒకవేళ ఆస్కార్ వేదికపై అవార్డు అందుకుంటే, ఏమాత్రం సంకోచించకుండా స్వచ్ఛమైన తమిళంలోనే ప్రసంగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 1960ల నాటి వింటేజ్ లుక్‌లో విజయ్ సేతుపతి మార్క్ నటన, లిజో మోల్ జోస్ నటన, సాయి అభ్యంకర్ అందించిన సంగీతం 'బత్తా' చిత్రాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాయి. మరి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులని తిరగరాస్తుందో చూద్దాం.

 

 

[Vijay Sethupathi Baththa Telugu Release Date, Atlee About Baththa Release Date, Baththa Release Update, Vijay Sethupathi, Baththa Telugu Release, Director Atlee, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com