
సినిమా నిజాన్ని మాత్రమే చెప్తుందనేది అభిమానులు, సినీ ప్రేమికులు, ప్రేక్షకుల ప్రగాఢమైన నమ్మకం. కానీ అలాంటి సినిమా తమ రిలీజ్ డేట్ విషయంలో ఎందుకు దోబూచులాడుతుందనేది కూడా ఇప్పుడు వాళ్లందరికీ అంతు చిక్కని రహస్యం లాగా మిగిలింది.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఏ పెద్ద సినిమా విడుదల ప్రకటన వచ్చినా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రకటనల వరకు గ్రాండ్‌గా ప్రచారం చేసే మేకర్స్, ఆఖరి నిమిషంలో వాయిదా వేస్తూ అభిమానులకు మిగిల్చేది తీరని నిరాశే. ఇటీవల వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, మళ్లీ వాయిదా పడటంతో సినీ వర్గాల్లోనూ, డిస్ట్రిబ్యూటర్లలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు సినిమా విడుదలకు ఇచ్చిన డేట్‌ను ఒక ప్రామిస్‌గా భావించేవారు, కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటన కేవలం ఒక తాత్కాలిక ఆలోచనగా మాత్రమే మారిపోవడం పరిశ్రమ
సినీ విశ్వసనీయతని దెబ్బతీస్తోంది.
దసరా వంటి అతిపెద్ద పండుగ సీజన్ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వేస్ట్ అయిపోతోంది. లాంగ్ హాలిడేస్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద సాధించాల్సిన వందల కోట్ల భారీ కలెక్షన్లను నిర్మాతలు చేతులారా కోల్పోవాల్సి వస్తోంది. ఒకసారి సోలో పండుగ విండో మిస్ అయితే, మళ్లీ అలాంటి అనుకూలమైన డేట్ దొరకడం అంత సులభం కాదు. దీనివల్ల నిర్మాతలు "ఇకపై మరోసారి ఇలాంటి తప్పు చేయం" అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించే పరిస్థితులు వస్తున్నాయంటే టాలీవుడ్ బాక్సాఫీస్ ప్లానింగ్ లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. వరుస వాయిదాలు కేవలం కలెక్షన్లపైనే కాకుండా, థియేటర్ బిజినెస్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్‌పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
.webp)
రిలీజ్ డేట్లని పదే పదే మార్చడం వెనుక రీ-షూట్‌లు, విఎఫ్ఎక్స్ (VFX) ఆలస్యం, మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం సదరు చిత్రంతో పాటుగా బిజినెస్ చేసుకునే చిన్న చిత్రాలపై మరియు తదుపరి వరుసలో ఉన్న ఇతర స్టార్ హీరోల సినిమాలపై పడుతుంది. ప్రచార చిత్రాలు, టీజర్లు, పాటలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసి, సరిగ్గా రిలీజ్ దగ్గరపడే సమయానికి వాయిదా ప్రకటించడం వల్ల ప్రేక్షకులు తమ ప్లాన్స్‌ను మార్చుకోవాల్సి వస్తోంది. ఫలితంగా, భవిష్యత్తులో ఆ సినిమాపై ఉన్న ఉత్సాహం మరియు క్రేజ్ కూడా క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
సినిమా నిర్మాణ బడ్జెట్లతో పాటు పబ్లిసిటీ వ్యయం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, రిలీజ్ పోస్ట్‌పోన్‌మెంట్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రెజర్ మరింత తీవ్రమవుతోంది. ఒక బిగ్ బడ్జెట్ సినిమా ఆలస్యమైతే నెలనెలా వడ్డీల భారం పెరిగిపోయి ఓపెనింగ్ కలెక్షన్లలో వచ్చే లాభాలను సైతం మింగేస్తుంది. పండుగ రోజులను బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూసే సగటు సినీ ప్రేక్షకుడి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్స్ పైనే ఉంది. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీషన్ మేనేజ్‌మెంట్ మరియు సరైన రిలీజ్ స్ట్రాటజీలతో ముందుకెళ్తేనే పెద్ద సినిమాల ప్రామిస్‌పై ప్రేక్షకులకు తిరిగి నమ్మకం ఏర్పడుతుంది. ఏది ఏమైనా పక్కా ప్లాన్ తో బౌండెడ్ స్క్రిప్ట్ తో వెళ్తే సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుంది. కానీ సంవత్సరం ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం అవసరమా అధ్యక్షా అని సినీ ప్రేమికులు తమ సినీ ఊసుల్లో చెప్పుకుంటున్నారు.
[Tollywood Star Movies Release Postponed Controversy, Tollywood Release Postponed, Aadarsha Kutumbam Movie, Venkatesh New Movie, Tollywood Box Office, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





