
శ్రీవిష్ణు సినిమాలకు సాధారణంగా మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ మీద నమ్మకం కలిగితే.. ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. కానీ ఈసారి పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. అక్టోబర్ 9న రానున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా రిలీజ్‌కు పట్టుమని మూడు రోజులు కూడా లేకపోయినా.. అసలు సినిమా వస్తుందన్న బజ్ పెద్దగా కనిపించడం లేదు.
అంచనాలు లేకుండా సినిమా రిలీజ్ అవడం ప్లస్సా మైనస్సా? అనేది పక్కన పెడితే, ఈ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై మాత్రం గట్టిగానే పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో వచ్చిన శ్రీవిష్ణు సినిమాలతో పోలిస్తే.. ‘కామ్రేడ్ కళ్యాణ్’కు ఈ స్థాయిలో తక్కువ పబ్లిసిటీ కనిపించడం ఇదే మొదటిసారి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా రిలీజ్ డేట్ కూడా చాలామంది ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ అయిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు కూడా లేకపోవడంతో.. ఇప్పటికైనా ప్రమోషన్స్ జోరందుకోవాల్సిన అవసరం ఉందని సినీ అభిమానులు అంటున్నారు.
శ్రీవిష్ణు మాత్రం తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా కాన్సెప్ట్ ఏంటి? అందులో తన పాత్ర ఎలా ఉండబోతోంది? ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి క్రియేట్ చేయాలి? అనే విషయాల్లో ముందుగానే మంచి బజ్ తీసుకొస్తుంటారు. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ విషయంలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు.

నిజానికి ఈ దసరా బరిలో అక్టోబర్ 9నే విడుదల కావాల్సిన పెద్ద సినిమా ‘ఆదర్శ కుటుంబం’ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ టైంలో ‘కామ్రేడ్ కళ్యాణ్’ను గట్టిగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలిగితే.. ఆ సినిమా మార్కెట్‌కు ఇది మంచి అడ్వాంటేజ్ అయ్యేది.
ముఖ్యంగా పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ కూడా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో పెద్దగా పోటీ లేకుండా దొరికిన స్పేస్‌ను శ్రీవిష్ణు సినిమా ఎంతవరకు ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిజల్ట్ అనేది పూర్తిగా టాక్ పైనే ఆధారపడి ఉంది. ఒక్కసారి సినిమా బాగుందనే టాక్ వస్తే.. ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. టాక్ నెగెటివ్ గా వస్తే మాత్రం.. కనీస ఓపెనింగ్స్ కూడా రాక పూర్తిగా బోల్తా పడే ప్రమాదముంది.
మరి చివరి మూడు రోజుల్లో మేకర్స్ ప్రమోషన్స్‌ను పెంచి సినిమాపై బజ్ తీసుకొస్తారా? లేక ఎలాంటి హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి.. సినిమా టాక్‌తోనే తన సత్తా చూపిస్తుందా? అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: చుట్టమల్లే AI వీడియో వివాదం: రంగంలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్.!
[No Buzz For Comrade Kalyan, Comrade Kalyan Release Date, Aadarsha Kutumbam Postponed, Comrade Kalyan Movie, Sree Vishnu, Aadarsha Kutumbam Movie, Dasara 2026, Telugu Film News]






