Home

»

Latest News

Ustaad Bhagat singh: ఖుషి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ నే అంట.. లడ్డు అంటున్న నిర్మాత 

Mar 12, 2026

 

-మార్కెట్ లోకి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూడో సాంగ్ 
-నిజంగానే కాలర్ ఎత్తేలా ఉందా!
-నిర్మాత మాటలు వైరల్ 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)నుంచి మరో పవర్ ఫుల్ ప్యాక్డ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat singh)ఈ నెల 18 న బెనిఫిట్ షో నుంచి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్  వైఫై లాగా  ఉస్తాద్ తో సావాసం చేస్తున్నాయి. ఇక సాంగ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ తో వాతావరణం చూస్తుంటే సినిమా సగం హిట్ అయినట్టుగానే కనిపిస్తుందిరా అని అభిమానులు,మూవీ లవర్స్ మెల్లగా అనుకునే పరిస్థితి. కానీ ఈ రోజు రిలీజైన 'కాలరే ఎత్తర' సాంగ్ తో సగం హిట్ అయినట్టే అని గట్టిగానే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ నిర్మాత రవిశంకర్ యలమంచిలి(Ravi shankar yalaminchili)చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో, మూవీ లవర్స్ లో మరింత జోష్ ని తెప్పిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం.

రవిశంకర్ మాట్లాడుతు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సూపర్ గా వచ్చింది. మీరు సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఖుషి తర్వాత ఉస్తాద్ నే చూశామనే ఫీల్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మూవీలో పవన్ కళ్యాణ్ చాలా అందంగా ,లడ్డు లాగా ఉన్నారు.  సినిమా చూసాక అప్పుడే అయిందా అనిపిస్తుంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారు  చాలా కష్టపడ్డారు. సినిమా సూపర్ హిట్ ఖాయమని రవిశంకర్ చెప్పుకొచ్చాడు. 

Also read:  VIJay: విజయ్‌ని గట్టి దెబ్బ కొట్టిన కొడుకు జాసన్ సంజయ్!.. వాట్ నెక్స్ట్

'కాలరే ఎత్తర' సాంగ్ కొంచంసేపటి క్రితం హైదరాబాద్ లోని మైత్రి థియేటర్ లో అభిమానుల మధ్య రిలీజ్ అయ్యింది. ఆ ఈవెంట్ లోనే రవిశంకర్ మాట్లాడాడు. హరీష్ శంకర్,(Harish Shankar) శ్రీలీల(Sreeleela)తో పాటు ఒక హీరోయిన్ గా చేస్తున్న రాశిఖన్నా(Raashii Khanna)కాలరే ఎత్తర' సాంగ్ సృష్టికర్త కాకర్ల శ్యాం కూడా  ఈవెంట్ లో పాల్గొని ఉస్తాద్ హిట్ ఖాయమనే అభిప్రాయాన్ని వెల్లడి చేసారు. ఇక మైత్రి బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పాన్ ఇండియా వ్యాప్తంగా ఏ సినీ ప్రియుడ్ని కదిలించినా మైత్రి బ్యానర్ హిట్ హిస్టరీ ని చెప్పేస్తాడు.  

 

  
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com