
ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని హావభావాలు పలికించినా అసలు నిజం దైవానికే ఎరుక. ఇప్పుడు ఆ సత్యాన్ని ఇళయ దళపతి 'విజయ్'(Vijay)విషయంలో గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. విజయ్ ఒక సినీ నటితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భార్య సంగీత విడాకులకి అప్లై చేయడం... కేసు విషయం తేలే వరకు విజయ్ ఇంట్లోనే ఉంటానని ఆస్తుల్లో తనతో పాటు తన పిల్లల వాటా ఇమ్మనడం... త్రిషనే ఆ సినీ నటి అనే రూమర్స్ వస్తుండటం...విజయ్, త్రిష ఒకే కలర్ డ్రెస్ కోడ్ తో ఫంక్షన్ కి హాజరు కావడం...ఇలా చక చకా జరిగిపోతున్నాయి. పైగా ఇవన్నీ ఇండియా వైడ్ గా సంచలన హోదాలో జనరేట్ అవుతు వస్తున్నాయి. ఇప్పుడు మరో సంచలన వార్త ప్రత్యేక హోదాలో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.
విజయ్, సంగీత(Sangeetha)కి జాసన్ సంజయ్(Jasan Sanjay),దివ్యషా(Divyasha)అనే కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినీ సర్కిల్స్ కధనం ప్రకారం జాసన్ సంజయ్ తన పేరులో తండ్రి ఇంటిపేరుకి బదులుగా తల్లి ఇంటిపేరుని ఉపయోగిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గాని తన పేరులో వి’స్థానంలో ఎస్’అక్షరాన్ని ఉపయోగిస్తున్నట్లుగా జాతీయ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోను బాగానే సర్క్యులేట్ అవుతున్న ఈ న్యూస్ తో విజయ్ అభిమానులు మరోసారి తమ హృదయంలో పెను భారానికి చోటు ఇవ్వాల్సిన పరిస్థితి.
also read: MOnalisa: పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా.. లవ్ జిహాద్ అంటున్న దర్శకుడు
జాసన్ సంజయ్ దర్శకుడిగా 'సిగ్మా'(Sigma)అనే టైటిల్ తో కూడిన సినిమాతో తెరంగ్రేటం చేయనున్నాడు. సందీప్ కిషన్,ఫరియా అబ్దుల్లా జంటగా చేస్తుండగా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ ని అన్ ఫాలో చేసాడు.






