
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు. ఆల్రెడీ వంద కోట్ల క్లబ్బులో చేరిన ‘మండాడి’ వరల్డ్ వైడ్‌గా ఇంకా దూసుకుపోతోంది.
‘మండాడి’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ టీంకి అభినందనలు తెలియజేశారు. ఇక తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ ‘మండాడి’ టీంని అభినందించారు. ప్రత్యేకంగా టీంని కలిసి ప్రతీ ఒక్కరితో మాట్లాడి ‘మండాడి’ గురించి గొప్పగా ప్రశంసించారు. దర్శక, నిర్మాతలో పాటుగా సూరి, సుహాస్, రవీంద్ర విజయ్ అందరినీ కమల్ హాసన్ ప్రత్యేకంగా కలిసి, అందరితో మాట్లాడి, బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు.
‘నా జీవితంలో మర్చిపోలేని ఓ ఘటన. ఈ రోజుని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా ‘మండాడి’ టీం మీద డా. కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మాకు ఈ అవకాశం కల్పించిన మహేంద్రన్ అన్నకి, డిస్నీ బ్రదర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సూరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘మండాడి’ చిత్రానికి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన బలాలుగా మారాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని మరో స్థాయికి తీసుకు వెళ్లాయి.
ఇది కూడా చదవండి: ప్యారడైజ్ ఉచకోత.. కలలో కూడా ఊహించని ఓపెనింగ్స్.!

మీకు నచ్చవచ్చు:
55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.!
రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!
[Mandaadi Movie Team, Kamal Haasan, Mandaadi 100 Crore Club, Mandaadi Movie Telugu, Suhas, Soori, Telugu Film News, Telugu News]




