Home

»

Latest News

ప్యారడైజ్ ఉచకోత: కలలో కూడా ఊహించని ఓపెనింగ్స్.!

Sep 23, 2026 12:09PM

నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ దగ్గర మాస్ సునామీ సృష్టించడానికి రెడీ అయిపోయారు. అసలు 'ది ప్యారడైజ్'తో నాని సెట్ చేస్తున్న రికార్డులు చూస్తుంటే ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల - నాని కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఇప్పుడు రిలీజ్ దగ్గర పడిన వేళ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.40 కోట్ల వరకు వచ్చాయి. దీంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముందని ట్రేడ్ అంచనా.

ప్యారడైజ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ఓవరాల్ గా రూ.103 కోట్ల బిజినెస్ చేసింది. నాని కెరీర్ లో మాత్రమే కాదు.. టైర్-2 హీరోల పరంగానూ ఇదే హైయెస్ట్ బిజినెస్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.105 కోట్ల షేర్ రాబట్టాలి. గ్రాస్ పరంగా చూస్తే.. 200 కోట్లు టార్గెట్. అయితే ఇందులో 35 శాతం మొదటి రోజే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి పాజిటివ్ టాక్ తోడైతే ఫస్ట్ వీకెండ్ (మొదటి నాలుగు రోజులు) లోనే చాలావరకు రికవర్ కానుంది.

ప్రస్తుతం ప్యారడైజ్ బుకింగ్స్  కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఓవర్సీస్ బుకింగ్స్ మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ డే అడ్వాన్స్ పరంగా ఇప్పటికే రూ.12 కోట్లు వచ్చాయి. ఇక నార్త్ అమెరికాలో అయితే 1 మిలియన్ మార్క్ ను దాటేసి సంచలనం సృష్టించింది. మొత్తానికి ఓపెనింగ్స్ పరంగా 'ప్యారడైజ్'తో నాని తన తోటి స్టార్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉన్నాడు. 

ఇది కూడా చదవండి: 'ది ప్యారడైజ్’చూడాలన్న నానికి సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే రిప్లై

మీకు నచ్చవచ్చు:
సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.!
రాయిని ఆడది చేసిన రాముడివా.. 44 ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.!

 

 

 

[The Paradise Day 1 Prediction, Nani Paradise Box Office Prediction, The Paradise Day 1 Collection, The Paradise Opening Day Collection, The Paradise Movie, Nani Paradise Movie, Telugu Cinema News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com