Home

»

Latest News

టాక్సిక్ vs హనుమాన్ అంశ్: బాక్సాఫీస్ వద్ద మారిన లెక్కలు ఏంటి..అర్ధమైన నీతి ఏంటి!

Sep 16, 2026 11:37AM

 

నువ్వు ఏ జోనర్ చెప్తున్నావనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకి నచ్చే విధంగా కంటెంట్ ఉందా లేదా అనేదే ముఖ్యం. ఇదే రీతిలో ఒకప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే  భారీ బడ్జెట్, టాప్ స్టార్ కాంబినేషన్, అంగరంగ వైభవంగా చేసే ప్రమోషన్లు మాత్రమే సరిపోయేవి. కానీ నేడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. 


స్టార్ పవర్ ఎంత ఉన్నప్పటికీ, కంటెంట్ లో దమ్ము లేకపోతే, 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతున్నాయి. కానీ కేవలం  2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఆధ్యాత్మిక సినిమాలు 260 కోట్లకి పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన 'టాక్సిక్', 'హనుమాన్ అంశ' చిత్రాల బాక్సాఫీస్ ప్రయాణమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఈ మధ్య కాలంలో అత్యంత భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ యష్  'టాక్సిక్' భారీ ఓపెనింగ్స్‌ సాధించినప్పటికీ రన్నింగ్ లో నిలదొక్కుకోలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం కంటెంట్.   కథనంలో లోపాలు, స్లో పేసింగ్, మితిమీరిన హింస, రొమాన్స్  కారణంగా ప్రేక్షకుల నుండి తీవ్ర ప్రతికూల స్పందన ఎదురైంది. ఫలితంగా కేవలం 18 రోజుల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా  340.75 కోట్ల గ్రాస్ మార్కు దగ్గరే ఆగిపోయింది. మూడో వారానికి వచ్చేసరికి అయితే  రోజువారీ వసూళ్లు 25 లక్షలకి  పడిపోయి, భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 

Also Read: వాళ్ళ చేతికి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ 'సిగ్మా' తెలుగు రైట్స్.. థియేటర్లలో రచ్చ ఖాయం!

 


 

అదే సమయంలో, ఎలాంటి ఆర్బాటం లేకుండా బాక్సాఫీస్ అరంగేట్రం చేసిన చిన్న చిత్రం 'హనుమాన్ అంశ' అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో తెరకెక్కి మొదటి రెండు వారాలు చాలా మందకొడిగా సాగింది. ఎనిమిదో రోజుకే ఫ్లాప్ జాబితాలో చేరుతుందనుకున్న వేళ మై హునా అంటూ  ప్రేక్షకుల మౌత్ టాక్  ఊపిరిపోసింది. ఏకంగా 38వ రోజున కూడా థియేటర్లలో సరికొత్త వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ, ఇండియాలోనే  214.63 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 268.05 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దాదాపు 10,700% ప్రాఫిట్ మార్జిన్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది.  

 

ఈ రెండు చిత్రాల ఫలితాలు సినీ విశ్లేషకులకు, నిర్మాతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. నేటి డిజిటల్ యుగంలో ఆడియన్స్ సినిమా పరిమాణాన్ని చూసి కాదు, సినిమాలోని కంటెంట్‌లోని ఆత్మను చూసి థియేటర్లకి  వస్తున్నారు. కంటెంట్ లో బలం, భావోద్వేగాలు ఉన్నప్పుడు బడ్జెట్ తో సంబంధం లేకుండా 2 కోట్ల సినిమా అయినా 260 కోట్లు సాధిస్తుంది. కథలో విషయం లేకపోతే 500 కోట్ల పాన్ ఇండియా వండర్ అయిన  కోలుకోలేని దెబ్బ తింటుంది. దీన్ని బట్టి సినిమా విజయానికి కంటెంటే అసలైన కింగ్ అని బాక్సాఫీస్ గణాంకాలు మరోసారి నిరూపించాయి. హనుమాన్  అంశ్ తెలుగులో 'హనుమాన్ అంశ'గా ఈ నెల 18 న విడుదల కానుంది. త్రివిక్రమ్ రిలీజ్ చేస్తున్నాడు.  

 

 

 

[Toxic, Hanuman Ansh, Content is King, Hanuman Ansh Budget, Toxic Budjet, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com