
బహుశా ఈ మధ్య కాలంలో స్టార్ హీరో ధనుష్ లాగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరో మరొకరు లేరు. పైగా తక్కువ సమయంలోనే పూర్తి చేసి రిలీజ్ చేయడంలో కూడా ధనుష్ స్పెషలిస్ట్. అందుకే సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ పేరు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
ఈ క్రమంలోనే ధనుష్ తన కెరీర్‌లో 56వ మైలురాయిగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ 'D56' పై సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'లబ్బర్ పందు' చిత్రంతో తమిళ చిత్రసీమలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ భారీ చిత్రాన్ని ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ 'వుండర్‌బార్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మించనున్నాడు. తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం, ఈ 'D56' ప్రాజెక్ట్‌కు 'పడయల్' (Padayal) అనే మాస్ అండ్ ఎనర్జెటిక్ టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా టాక్. పడయల్ అంటే దేవుడికి పెట్టే నైవేద్యం అని అర్ధం. గ్రామీణ నేపథ్యంలో సాగే 100% పక్కా రస్టిక్ అండ్ వయలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని తెలుస్తోంది. కథలోని తీవ్రత మరియు యాక్షన్ సన్నివేశాల రేంజ్ ఆధారంగా ఈ చిత్రానికి 'పుష్ప' ఫ్రాంచైజీ సినిమాల తరహాలోనే వైలెంట్ కంటెంట్ ఉండబోతోందని, అలాగే దీనికి 'A' సర్టిఫికేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు టాక్ చెబుతున్నాయి.
సెప్టెంబర్ 17న అంటే రేపు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ పూజా ముహూర్తంతోనే సినిమా షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుంది. రీసెంట్‌గా ధనుష్ 'కర' అనే రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 'పడయల్' రూపంలో మరో ఊరమాస్ యాక్షన్ విందును అందించబోతున్నారని వార్తలు రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ టైటిల్ మరియు గ్రాండ్ ఓపెనింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
.webp)
Also Read: టాక్సిక్ vs హనుమాన్ అంశ్: బాక్సాఫీస్ వద్ద మారిన లెక్కలు ఏంటి..అర్ధమైన నీతి ఏంటి!
ఇప్పటికే ధనుష్ ఖాతాలో అమరన్ ఫేమ్ 'రాజ్‌కుమార్ పెరియసామి' దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్ ప్రాజెక్ట్ 'OM' తో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'తమిళ్ మురుగన్' వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. 'OM' అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా అక్టోబర్ 15న రజనీకాంత్ భారీ చిత్రం 'జైలర్ 2' విడుదలవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ మాజీ మామ, అల్లుళ్ల మధ్య బిగ్ క్లాష్ జరిగేలా ఉంది.
[Dhanush, Dhanush 56, Padayal, Tamizharasan Pachamuthu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






