Home

»

Latest News

వాళ్ళ చేతికి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ 'సిగ్మా' తెలుగు రైట్స్.. థియేటర్లలో రచ్చ ఖాయం!

Sep 16, 2026 11:09AM


కొత్త సినిమా అంటేనే ఎలా ఉంటుందనే ఆసక్తి. అలాంటిది ఇళయదళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో మన తెలుగు హీరో సందీప్ కిషన్ చేసిన మూవీ 'సిగ్మా' వస్తుంటే ఎంతటి ఆసక్తి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 


 తెలుగు రాష్ట్రాల్లో 'సిగ్మా' ని  నైజాం మరియు కోస్తాంధ్ర రీజియన్లలో పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ చేజిక్కించుకుంది. సీడెడ్(రాయలసీమ) ప్రాంతంలో ఎన్వీఆర్ సంస్థ గ్రాండ్‌గా  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మైత్రి, ఎన్వీఆర్ సంస్థల బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అత్యధిక సంఖ్యలో థియేటర్లు కేటాయించబడతాయని, గ్రాండ్ రిలీజ్ దక్కనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ డాన్స్ మాస్టర్ అండ్ నటుడు రాజు సుందరమ్, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్ మరియు యోగ్ జపీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుందీప్ కిషన్ గతంలో నటించిన 'మైఖేల్' సినిమా  4.6 కోట్ల గ్లోబల్ గ్రాస్ వసూళ్లతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది. ఇప్పుడు జాసన్ సంజయ్ మేకింగ్ క్రేజ్, లైకా ప్రొడక్షన్స్ గ్రాండియర్, మైత్రి మరియు ఎన్వీఆర్ సంస్థల థియేట్రికల్ రీచ్ తో 'సిగ్మా' చిత్రం ఈ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

Also Read: 1000 కోట్ల క్లబ్ లో మమిత బైజు: కేరళ కుట్టి అరుదైన రికార్డు  

 లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన టీజర్, అలాగే మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ స్వరపరిచిన పాటలకు ప్రేక్షకులలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

 

 

[ Sigma, Jasan sanjay, Vijay, Sundeep Kishan, Fariya Abdullah, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com