Home

»

Latest News

Toxic: టాక్సిక్ రిలీజ్ వాయిదా.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ 

Mar 04, 2026

 

-యష్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్ 
-టాక్సిక్ వాయిదా 
-ఈ బుధవారాన్ని జీవితంలో మర్చిపోరు 
-వాయిదాకి గల కారణం ఏంటి! 

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న 'యష్'(Yash)అభిమానులు తమ దగ్గరలో ఉన్న గుళ్ళు, మసీదులు, చర్చిల బాట పట్టారు. తమ ఇష్టదైవాల ముఖాన్ని అదే పనిగా చూస్తూ  టాక్సిక్ రిలీజ్ డేట్ వాయిదాపడుతుందని చిన్న హింట్ కూడా రాలేదు కదా. అసలు మేకర్స్ లో ఆ అట్మాస్పియర్ కూడా కనపడలేదు. ఎందుకు ఇలా చేసావు స్వామి అని అడుగుతున్నారు. దీన్ని బట్టి టాక్సిక్(Toxic)రిలీజ్ వాయిదా డేట్ ఎంత షాకింగ్ న్యూస్ నో అర్ధం చేసుకోవచ్చు. మరి వాయిదాకి గల కారణాలని ఇష్టం లేకపోయినా అయిష్టంగానే చూద్దాం.

ఇరాన్(Iran),ఇజ్రాయిల్(israel) దేశాల మధ్య గత కొన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సదరు యుద్ధ మేఘాలు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్, అబుదాబి, కువైట్, ఖత్తర్ వంటి దేశాలకి సైతం పాకాయి. దీంతో  ఆ దేశాలపై కూడా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ కారణంగానే టాక్సిక్ వాయిదా పడింది. ఎందుకంటే సదరు గల్ఫ్ దేశాల సినీ మార్కెట్ చాలా పెద్దది. కొంత కాలం నుంచి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భారతీయ సినిమాలు సాధిస్తున్న కలెక్షన్స్ నే ఉదాహరణ. మేకర్స్ కూడా వరల్డ్ ప్రేక్షకులని దృష్టిలో  ఉంచుకొని భారీ ఖర్చుతో అన్ని హంగులని అమర్చుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ ని వాయిదా వెయ్యాలని కోరడంతో జూన్ 4 కి వాయిదా వేశారు.


also read:  Janhvi Kapoor: బలిపశువుని చేస్తున్నారు.. అసలు జాన్వీ కపూర్ ప్రాబ్లెమ్ ఏంటి! 

దీంతో ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు యష్ అభిమానుల ఆనందానికి తీవ్రమైన ఆటంకాన్ని కల్పించినట్లయింది. సోషల్ మీడియా వేదికగా వారంతా స్పందిస్తు మీ రెండు దేశాల్లో  ఎవరి ఆస్తులు ఎవరు లాక్కున్నారా! అంత పగ ఎందుకురా! యుద్ధం చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఇస్త్రీ చొక్కా నలగకుండా సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఇదే కదా ట్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com