Home

»

Latest News

Janhvi Kapoor: బలిపశువుని చేస్తున్నారు.. అసలు నీ ప్రాబ్లెమ్ ఏంటి! 

Mar 04, 2026

-ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది 
-మాటల యొక్క ఆంతర్యం ఏంటి!
-పెద్ది తో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందా 


తనదైన సినీ రోజు ఒకటి రావడం అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi)నట వారసురాలు 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలడం ఖాయం. ఆ వాక్కు ఎలాంటి అక్షర దోషం లేని అక్షర సత్యమని మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)దేవర నిరూపించింది. సదరు చిత్రంలో 'తంగం' అనే  మాస్ క్యారక్టర్ లో లవ్, రొమాన్స్, ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించడమే ఉదాహరణ. ఇప్పుడు మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్(Ram Charan)'పెద్ది' లో 'అఛ్ఛాయమ్మ' గా ఊర మాస్ క్యారక్టర్ లో కనిపించబోతుంది. మేకర్స్ ఆమె లుక్ ని రివీల్ చేసిన దగ్గరనుంచి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ పక్కా అని సోషల్ మీడియా వేదికగా హంగామ చేస్తూ ఉన్నారు.ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ పర్సనల్ న్యూస్ ఒకటి వాళ్ళ కంట పడింది. నువ్వు చెప్పేది హండ్రడ్ పర్శంట్  కరెక్ట్ జాన్వీ అని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

జాన్వీ కపూర్ సోదరుడు పేరు అర్జున్ కపూర్(Arjun Kapoor). జాన్వీ తండ్రి బోనీకపూర్ మొదటి భార్య కుమారుడే అర్జున్ కపూర్. గత కొన్ని రోజుల నుంచి  సోషల్ మీడియాలో భారీగానే ట్రోల్  అవుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జాన్వీ  మాట్లాడుతు 'సోషల్ మీడియా సంస్కృతి ఏంటంటే వాళ్ళు వైరల్ అవ్వడానికి మనల్ని బలిపశువుల్ని చేస్తుంటారు. మనల్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని బాధగా అనిపించినా అలాంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. నిజానికి ఆ వార్తలకి మీకు సంబంధం కూడా ఉండదు. కానీ వాళ్ళకి వ్యూస్ నే ముఖ్యం. అందుకోసం ఎంత మంది బాధపడినా పర్వాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రవర్తనని క్షమించకూడదు. నెగిటివిటి కి దూరంగా ఉండండని జాన్వీ  చెప్పుకొచ్చింది.

అర్జున్ కపూర్ ట్రోల్ అవ్వడానికి కారణం వయసులో తనకంటే పన్నెండేళ్ళు పెద్దదైన బాలీవుడ్ భామ మలైకా అరోరా(Malaika Arora)తో రిలేషన్ లో ఉండేవాడు. కానీ ఆ రిలేషన్ రీసెంట్ గా  క్యాన్సిల్ అయ్యింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com