Home

»

Latest News

రజినీకాంత్ తల్లి చేసిన పనికి షాక్ అయిన రమ్యకృష్ణ!

Mar 04, 2026

సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ‘పడయప్ప’ చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘నరసింహ’ పేరుతో రిలీజ్ చేశారు. రెండు భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా ఇది. రజినీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య, రాధారవి, లక్క్ష్మీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికిి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. డబ్బు కంటే ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు ప్రధానం అని చెప్పే ఈ సన్నివేశంలో ఏం ఉందో తెలుసుకుందాం. 

తన కూతురి ప్రాణాలు కాపాడాలని, అందుకు నరసింహతో పెళ్లి ఒక్కటే మార్గమని నరసింహ తల్లిని వేడుకుంటాడు అన్నయ్య. గతంలో తాను చేసిన తప్పులను మన్నించమని, తన బిడ్డ ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయని చెల్లెల్ని ప్రాధేయపడతాడు. దానికి స్పందించిన నరసింహ తల్లి రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకుంటానని మాట ఇస్తుంది. నరసింహ కూడా తల్లి ఇష్టమే తన ఇష్టమని చెబుతాడు.

అందరూ అనుకున్నట్లుగా నిశ్చితార్థం జరుగుతుందని భావించి ఊరి జనం ముందు తాంబూలాలు మార్చుకోవడానికి సిద్ధమవుతారు. అయితే, అక్కడే నరసింహ తల్లి తన అసలు పంతాన్ని బయటపెడుతుంది. గతంలో తన కూతురిని ఏడిపించి, డబ్బు లేదనే కారణంతో తనను అవమానించిన విషయాన్ని అన్నయ్యకు గుర్తు చేస్తుంది. ‘ఈరోజు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నా కాళ్ళ మీద పడ్డావు’ అంటూ నిలదీస్తుంది.

తన అన్నయ్య ఇంటిలో పనిచేసే అమ్మాయితో నరసింహ పెళ్లి ఫిక్స్ చేస్తూ నిశ్చితార్థం చేస్తుంది. ఇది నీలాంబరికి, ఆమె తండ్రికి గట్టి షాక్ అవుతుంది. నిశ్చితార్థం చేసుకోవడానికి మీ ఇంటికి వస్తానని చెప్పానని, అదే చేశానని అంటుంది నరసింహ తల్లి. తన కొడుకు మనసు ఎంతో స్వచ్ఛమైనదని, వాడు కర్పూరం లాంటివాడు అని చెబుతుంది. కన్నవారు పిల్లల మనసును అర్థం చేసుకోవాలని, ఆస్తిపాస్తుల కోసం కాకుండా ఇష్టపడిన వారితోనే పెళ్లి జరగాలని చెబుతూ, నరసింహ మనసులో ఉన్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకుంటానని ప్రకటిస్తుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మనిషికి విలువ ఉండదని, పరువు పోయిన తర్వాత తలెత్తుకుని తిరగలేరని అక్కడ ఉన్న జనం చర్చించుకుంటారు. తన కొడుకు ప్రేమను గౌరవిస్తూనే, తనను అవమానించిన వారికి నరసింహ తల్లి బుద్ధి చెప్పిన తీరు ఈ సన్నివేశంలో అద్భుతంగా చిత్రీకరించబడింది. ఆసక్తికరమైన సన్నివేశాలు, డైలాగులు, చక్కని ఎమోషన్స్‌తో నిండిన ఈ వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone Cinema ను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com