
డిజాస్టర్ అనే వర్డ్ కి కూడా ఒక రేంజ్, లెవెల్ ఉంటుందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించే పరిస్థితి సినిమాని దాపురించింది. మరి ఆ సినిమాని నమ్ముకొని భారీ మొత్తానికి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.
రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన పెద్ద చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ 'సర్దార్ 2' బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కార్తీ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్లాప్‌గా నమోదైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల భారీ మొత్తానికి థియేట్రికల్ హక్కులను విక్రయించారు. కానీ, థియేటర్లలో విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి ప్రతికూల టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కేవలం 9.25 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇక తెలుగు రాష్ట్రాల హక్కులని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొనుగోలు చేయగా కేవలం 2.50 కోట్ల వసూళ్లు మాత్రమే రావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనివల్ల తెలుగు బయ్యర్లు భారీగా మునిగిపోయారు. మరోవైపు, కన్నడ సూపర్ స్టార్ యష్ 'టాక్సిక్' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Also Read: Ee Paata Korinavaaru Review: ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి మూవీ రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల భారీ థియేట్రికల్ వసూళ్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే, బాక్సాఫీస్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 160 కోట్ల వద్దే ఆగిపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోవడంతో కొనుగోలు చేసిన బయ్యర్లకి కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది. టాలీవుడ్ విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం కూడా ఈ ఏడాది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచి డిస్ట్రిబ్యూటర్లని తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బిజినెస్ జరుపుకున్న 'రాజాసాబ్' చిత్రం కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతల కంటే ముందుగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారనే చేదు నిజాన్ని ఈ ఏడాది గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. కథలో బలం లేకపోవడం, ఆకట్టుకోని కథనం కారణంగా థియేటర్లలో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. అందుకే అంటారు కథ, కథనం ని మించిన పాన్ ఇండియా స్టార్ పుట్టడు, పుట్టబోడు. వాపుని చూసి బలుపు అనుకోకూడదని కూడా మరోసారి రుజువయ్యింది.
.webp)
ustaad Bhagath Singh, Toxic, Sardar 2, Pawan Kalyan, Karthi, yash, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood Cinema News, Tollywood






