
-సినిమా పేరు: ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి
-నటీనటులు: హర్ష, అమ్యరా గోసామి, రవివర్మ, సుజనా రెడ్డి తదితరులు
-సినిమాటోగ్రఫీ:సామ్ సుప్రీత్
-మ్యూజిక్: జే రెక్స్
-సమర్పణ: వి వి సత్యనారాయణ రాజు
-నిర్మాత: చంద్ర సిద్దార్ధ
-బ్యానర్ : ఫిల్మోత్సవ్
-కథ: మదన్
-రచన,దర్శకత్వం: చంద్ర సిద్ధార్ధ
-రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 18 ,2026
'ఆ నలుగురు' వంటి ఉత్తమ విలువలు గల కుటుంబ కథా చిత్రాన్ని అందించిన దర్శకుడు చంద్ర సిద్దార్ధ. అదే చిత్రానికి కథని అందించడంతో పాటు 'పెళ్లైన కొత్తలో' వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు మదన్. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి 'ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి' మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సాగర్( హర్ష) బాగా డబ్బున్న పెద్దింటి కుర్రోడు.. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఉన్న తమ ఫామ్ హౌస్ లో ఉంటాడు. విజయవాడ కేంద్రంగా ప్రసారమయ్యే రేడియోలో నెమలి పాలెం అనే గ్రామానికి చెందిన రమా, జ్యోత్స, నందు, కబీర్, మురళి, డోల్ రవి కోరిన ' కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు, కొన్ని అలకలు' అనే మనిషి ఆంతరాళంలో దాగి ఉండే సాంగ్ వస్తు ఉంటుంది. ఆ సాంగ్ ప్రతి రోజు రాత్రి 10 .30 కి వస్తు ఉంటుంది. కానీ ఆ సాంగ్ వినగానే నల్లటి ముసుగు వేసుకున్న ఒక యువతీ పొడవాటి కత్తితో సాగర్ ని చంపడానికి వెంటాడుతూ ఉన్నట్టుగా సాగర్ కి అనిపిస్తూ ఉంటుంది. దీంతో నెమలిపాలెం వెళ్తాడు. కానీ ఆ ఊరు మొత్తం నేలమట్టమయ్యి మనుషులు ఎవరు ఉండరు. మరి ఆ సాంగ్ ని నెమలిపాలెం నుంచి కోరుతుంది ఎవరు? సాగర్ కి ఎందుకు అలాంటి కల వస్తుంది? తన ప్రయాణంలో తెలుసుకున్న నిజం ఏంటి? రమా, జ్యోత్స, నందు, కబీర్, మురళి, డోల్ రవి ఉంది ఉంటే ఆ పేర్లు వెనక దాగి ఉన్న కథ ఏంటి అనేదే ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి.
ఎనాలసిస్
కథగా చూస్తే ఎంతో క్యూరియాసిటీ కలిగించే కథనే .కానీ సెల్యులాయిడ్ పై తెరకెక్కే సరికి కథలో ఉన్న అందం మొత్తం పోయింది. అందుకు ప్రధాన కారణం కథనం, నటీనటులు, నిర్మాణ విలువలు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాకపోతే విజువల్ పరంగా, దర్శకత్వం పరంగా పర్వాలేదని చెప్పుకున్నా ఈ రోజుల్లో అలాంటి టేకింగ్ పనికి రాదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టార్టింగ్ క్యూరియాసిటీ తోనే సీన్స్ వచ్చాయి. సాగర్ మధ్య లేడీ యంగ్ పని మనిషి మధ్య వచ్చిన సీన్స్ పర్లేదు. ఎంటర్ టైన్ మెంట్ కూడా పర్వాలేదు. కానీ సీన్ తో సీన్ వెళ్లే కొద్దీ క్యూరియాసిటీ మిస్ అయ్యింది. సినిమా మెయిన్ పాయింట్ నే రేడియోలో వచ్చే సాంగ్ కాబట్టి సాగర్ ఆ సాంగ్ కోరిన వారి కోసం వెళ్లే ప్రాసెస్ ని బిల్డప్ సీన్స్ తో ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది.
అలా కాకుండా నార్మల్ గా ఎస్టాబ్లిష్ చేసారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగర్, అతని ఆడపనిమనిషి, మగ పనిమనిషి మధ్యనే సాగాయి. సాగర్ అమెరికాలో ఉండే తన డాక్టర్ అన్నయ్య ( రవివర్మ) తో ఫోన్ లో మాట్లాడే సన్నివేశాలతో క్యూరియాసిటీ కలిగించే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా చెయ్యలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ' రమా, జ్యోత్స, నందు, కబీర్, మురళి, డోల్ రవి' మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. ఆ సన్నివేశాలతో సినిమాకి ఒక కొత్త లుక్ కూడా వచ్చింది. ఎంత ప్రాణ స్నేహితులైనా ఆడపిల్ల విషయంలో ఈర్ష్య, అసూయ అనేవి ఏదో ఒక టైంలో దండయాత్ర చేయకుండా ఉండలేవని చెప్పడం బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఆ తర్వాత అర్ధం పర్థం లేని ప్రీ క్లైమాక్స్ వరకు వచ్చాయి. క్లైమాక్స్ లో సాగర్ అన్నయ్య చెప్పే డైలాగ్ తో పాటు రమా, మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆమె కొడుకు కనిపించడం బాగుంది.
నటీనటులు సాంకేతిక నిపుణల పనితీరు
సాగర్, నందుగా హర్ష నటనలో పెద్దగా మెరుపులు లేవు. లుక్ పరంగా బాగానే ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అంతగా వర్క్ అవుట్ కాలేదు. అమ్యరా గోసామి, రవివర్మ, సుజనా రెడ్డి మిగతా అన్ని క్యారెక్టర్స్ లో చేసిన వాళ్ళు తమ క్యారక్టర్ పరిధి మేరకు మెప్పించారు. దర్శకుడిగా చంద్ర సిద్దార్ధ ఎలాంటి మెరుపులు చూపించలేకపోయాడు. ఎందుకనో ఆయనకే తెలియాలి. పులగం చిన నారాయణ నుంచి వచ్చిన డైలాగ్స్ పర్లేదు. ఫొటోగ్రఫీ వర్క్ అవుట్ కాలేదు. నిర్మాణ విలువలు సో సో. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్
కథ బలం, కథనం బలహీనత
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం






