
నంది అవార్డు.. ఈ పదం వినగానే తెలుగు సినిమా, నటీనటులు, నటీమణులతో పాటు 24 క్రాఫ్ట్స్ యొక్క సినీ హృదయం పులకరించిపోతుంది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా నంది ని అందుకంటూ అసలైన కళాకారులుగా మురిసిపోతుంటారు. నంది అవార్డ్స్ కి అంత ప్రాముఖ్యత ఉంది. కొన్ని ఏళ్లుగా ఇవ్వడం ఆగిపోయిన నంది తిరిగి రంకె వేయనుంది.
ఈ విషయంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతు' విభజన తర్వాత 2014 నుండి తలెత్తిన రాజకీయ పరిణామాలు, సాంకేతిక మరియు పరిపాలనాపరమైన జాప్యాల కారణంగా నంది అవార్డుల ప్రదానం నిలిచిపోయింది. అయితే కళాకారుల ప్రతిభను గౌరవించడం, కళను పోషించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ నంది అవార్డుల వేడుకను ఉగాది నాటికి నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

Also Read: ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకి భారీ నష్టాలు మిగిల్చిన టాప్ సినిమాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కొత్త ఫిలిం పాలసీని త్వరలోనే రూపొందిస్తున్నాం.దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ సంవత్సరాల పురస్కారాలను ఎలా అందజేయాలనే అంశంపై చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో, నటీనటులు, దర్శకులు మరియు నిర్మాతలతో కూడిన కమిటీ ద్వారా చర్చించి సమగ్రమైన రూట్‌మ్యాప్ సిద్ధం చేయనున్నారు. ఇక నంది అవార్డుల పునరుద్ధరణ నిర్ణయం పట్ల టాలీవుడ్ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కళను, కళాకారులను గౌరవించే సాంప్రదాయాన్ని పునఃప్రారంభిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమా రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.1964 లో నంది తన ఘనమైన సినీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది.
Minister Kandula Durgesh About Nandi Awards, chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh, Tollywood Updates, TeluguCinema News, TeluguCinema, Tollywood, Tollywood News






