TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఇంటర్వెల్ వరకు సూపర్: సెకండాఫ్‌ వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు..శాపమా? స్వయంకృతాపరాధమా?

Nov 27, 2026 10:06AM


థియేటర్ లోపలకి భారీ అంచనాలతో అభిమానులు, సినీ ప్రేమికులు,ప్రేక్షకులు వెళ్లారు. షో స్టార్ట్ అయ్యింది. ఇక అంతే.. ఫస్ట్ సీన్, హీరో ఇంట్రడక్షన్ సీన్స్ తోనే అబ్బా మనంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. మూవీ సూపర్ గా ఉండబోతుంది. ఒక్క నిమిషం కూడా కళ్ళు మూయడం గాని, పక్కకీ తిరగడం కానీ చెయ్యకూడదని, మనకి తెలియకుండానే  స్వాతి ముత్యంలో కమల్ హాసన్ రేంజ్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఫిక్స్ అయిపోతాం.

డై హార్ట్ ఫ్యాన్స్ అయితే, సీన్ బై సీన్ చూస్తూనే తమ అభిమాన సంఘ సభ్యులకి మెసేజ్ ల రూపంలో  మూవీ  సూపర్ డూపర్ హిట్ ఈ సారి  అన్ని రికార్డులు మనయ్యే. ఎవర్ని వదిలే ప్రసక్తే లేదు అంటు, లైఫ్ లో సెటిల్ అయినవాళ్లలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలోను అదే బ్యాచ్ కనిపిస్తుంటుంది. 

ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. నిదానంగా ఆ అందరి కళ్ళు బక్కచిక్కిపోతుంటాయి. సినిమా ఏదో తేడాగా ఉందే అని. ఇది వాస్తవం.ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులని  కుర్చీలకి అతుక్కుపోయేలా చేస్తున్న దర్శకులు.. ఆ తర్వాత మాత్రం అదే మ్యాజిక్‌ను కొనసాగించలేకపోతున్నారు. క్లైమాక్స్ వచ్చేసరికి అయితే  ఉత్సాహం మొత్తం నీరుగారిపోతోంది. 

ఇటీవల వస్తున్న చాలా పెద్ద సినిమాలను గమనిస్తే ఈ  విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్టాఫ్‌లో హీరో ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు, ఎమోషనల్ ఎపిసోడ్స్‌తో దర్శకులు అదరగొడుతున్నారు. ఇంటర్వెల్ దగ్గర ఓ భారీ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు.

కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత మాత్రం కథ ముందుకు వెళ్లడం లేదు. అనవసరమైన సన్నివేశాలు, సాగదీసే ఎపిసోడ్స్, రొటీన్ ఫైట్స్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇంటర్వెల్ దగ్గర ఇచ్చిన హైప్‌కు తగ్గట్టుగా క్లైమాక్స్‌ను డిజైన్ చేయలేకపోతున్నారు. దీంతో సినిమా మొదట్లో వచ్చిన పాజిటివ్ టాక్ క్రమంగా తగ్గిపోతోంది. 


రామ్ చరణ్  'పెద్ది' విషయంలో ఫస్టాఫ్‌లోని ఎమోషన్స్, రా యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చర్చ జరిగింది. అయితే మూడు గంటలకు పైగా ఉన్న నిడివి, సెకండాఫ్‌లోని కొన్ని ఎపిసోడ్స్ విషయంలో విమర్శలు వినిపించాయి.గేమ్ ఛేంజర్'లో ఇంటర్వెల్ బ్యాంగ్, పొలిటికల్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నా.. సెకండాఫ్‌లో రొటీన్ కథనం సినిమాకు ఇబ్బందిగా మారిందనే విమర్శలు వచ్చాయి. ప్రభాస్ 'ది రాజా సాబ్' విషయంలోనూ కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్‌పై ప్రశంసలు వచ్చినప్పటికీ, ద్వితీయార్థం నిడివి, వీఎఫ్ఎక్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తమైంది. 

ఇది కూడా చదవండి:భోగి ట్విట్టర్ రివ్యూ ఇదే: మరి హిట్ అందుకున్నాడా! లేక....

నాని 'ది ప్యారడైజ్' విషయంలోనూ ఇదే తరహా చర్చ జరిగింది. 1980ల నాటి నేపథ్యంతో ఫస్టాఫ్‌లో క్రియేట్ చేసిన ఇంటెన్సిటీని ద్వితీయార్థంలో కొనసాగించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎడిటింగ్, సాగతీత సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయనే కామెంట్స్ వచ్చాయి.

టాలీవుడ్‌లో ఈ సెకండాఫ్ సమస్యకి  ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఇంటర్వెల్ హైప్‌ అందుకోలేకపోవడం

ఇంటర్వెల్ వరకు కథను వేగంగా నడిపించి, భారీ ట్విస్ట్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. కానీ ఆ తర్వాత కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో తడబడుతున్నారు. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ఎలివేషన్‌ను క్లైమాక్స్ వరకు కొనసాగించలేకపోతున్నారు.

2. అవసరానికి మించిన నిడివి

ప్రస్తుతం చాలా భారీ సినిమాలు రెండు గంటల 45 నిమిషాల నుంచి మూడు గంటలకు పైగా ఉంటున్నాయి. కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాలను జోడించడం వల్ల సినిమా నిడివి పెరుగుతోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఈ సాగతీత ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తోంది.

3. కథ కంటే విజువల్స్‌కే ప్రాధాన్యత

భారీ సెట్లు, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, హీరో ఎలివేషన్లపై పెట్టే శ్రద్ధలో కొంతైనా కథ, స్క్రీన్‌ప్లేపై పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంత గొప్ప విజువల్స్ ఉన్నా కథలో బలం లేకపోతే ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టడం కష్టమే. 


పెద్ద హీరోల సినిమాలకు ఇది మరింత ప్రమాదం!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', బాలకృష్ణ 'అఖండ 2', కమల్ హాసన్ 'థగ్ లైఫ్' వంటి సినిమాల విషయంలోనూ సెకండాఫ్ పట్టు కోల్పోయిందనే చర్చలు వచ్చాయి. విజయ్ దేవరకొండ 'రణబాలి', యశ్ 'టాక్సిక్' సినిమాల నిడివి, హింసాత్మక సన్నివేశాల విషయంలోనూ ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ఇక్కడ మరో విషయం గమనించాలి. పెద్ద హీరో సినిమా అంటే భారీ ఓపెనింగ్స్ రావడం సహజం. అభిమానులు మొదటి రోజే థియేటర్లకు వస్తారు. కానీ సినిమా బాగుంటేనే ఆ తర్వాతి రోజుల్లో సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారు. కేవలం హీరో ఇమేజ్‌తో మొదటి రోజు వసూళ్లు సాధించవచ్చు కానీ మూవీ నిలబడాలంటే కంటెంట్ బలంగా ఉండాలి.


దర్శకులు మారాల్సిన సమయం వచ్చిందా?
నిజానికి సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ అంటూ విడివిడిగా కాకుండా ఒకే కథగా ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేయాలి. ఇంటర్వెల్ దగ్గర భారీ ట్విస్ట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో.. ఆ తర్వాత కథలో వచ్చే మలుపులు కూడా అంతే ఆసక్తికరంగా ఉండాలి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర అనవసరమైన సన్నివేశాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. మూడు గంటల సినిమా తీస్తేనే గొప్ప సినిమా అవుతుందనే ఆలోచన నుంచి బయటకు రావాలి.

మొత్తానికి టాలీవుడ్‌కు ఇప్పుడు కావాల్సింది భారీ బడ్జెట్లు కాదు.. బలమైన కథలు! ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం గొప్ప విషయమే. కానీ సినిమా పూర్తయ్యాక కూడా అదే ప్రేక్షకులు బాగుందని చెప్పుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తేనే దర్శకుడి విజయం. అలా చెయ్యకపోవడం వల్ల అభిమానులు, ప్రేక్షకులు, మూవీ లవర్స్ థియేటర్స్ నుంచి 'ఎందరిని ఏ దరికి చేర్చినా, సంద్రాన ఒంటరిగా మిగలదా నావ' అని పాడుకుంటూ బయటకి వస్తున్నారు.

మీకు నచ్చవచ్చు

జూనియర్ ఎన్టీఆర్ రాముడి పెయింట్ వైరల్: ఆ హీరో ట్వీట్ వైరల్! 

నాన్న కుట్టి మూవీ రివ్యూ!

 

[Tollywood Second Half, Curse Big Budget, Bhogi, Sharwanand, Tollywood]

 

google-ad-img