భోగి ట్విట్టర్ రివ్యూ ఇదే: మరి హిట్ అందుకున్నాడా! లేక....
Nov 27, 2026 9:44AM
.webp)
మాస్ అండ్ రగ్గడ్ గా ఉదయం ఏమినిదిగంటల ఆట నుంచే థియేటర్స్ లో రన్ అవుతూ ఉన్నాను అంటూ 'భోగి' తో శర్వానంద్ చెప్తున్నాడు. సంపత్ నంది దర్శకుడు కాగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్. అసలు రివ్యూ మా నుంచే మీరు చదివే లోపు ట్విటర్ రివ్యూ ఒకటి నేను కూడా ఉన్నాను గుర్తించండి అంటుంది. మరి ట్విట్టర్ రివ్యూ ని చూసేద్దాం.
ట్విట్టర్ టాక్ ప్రకారం సినిమాకు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. శర్వానంద్ మాస్ మేకోవర్, యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్ సీన్స్‌కు ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు కథలో కొత్తదనం లేకపోవడం, నెమ్మదిగా సాగే కథనం విమర్శలకు కారణమవుతున్నాయి.
నెటిజన్లు ఏమంటున్నారు?
- శర్వానంద్ తన కెరీర్లోనే భిన్నమైన రస్టిక్ మాస్ లుక్‌లో కనిపించాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
- యాక్షన్ ఎపిసోడ్స్, పంచ్ డైలాగ్స్ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
- డింపుల్ హయాతి రోల్ కి మంచి మార్కులు పడుతున్నాయి.
- ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
- కథలో కొత్తదనం లేదని, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నాయని విమర్శిస్తున్నారు.
- హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
.webp)
ఇది కూడా చదవండి: ఇప్పుడు విశాల్ ఆశలన్నీ సమంత పైనే!
భోగి హిట్ లేదా ఫట్టా?
మొత్తంగా చూస్తే శర్వానంద్ నటన, మాస్ యాక్షన్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తుండగా.. కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్నా, మరికొందరు మాత్రం తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.
ఫైనల్‌గా భోగికి ప్రస్తుతానికి మిక్స్డ్ ట్విట్టర్ టాక్ వినిపిస్తోంది. పూర్తి స్థాయి ప్రేక్షకుల స్పందనతోనే సినిమా బాక్సాఫీస్ ఫలితం తేలనుంది. చివరిగా ఒక మాట ఏంటంటే ట్విట్టర్ రివ్యూ అంచనాలు తప్పిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
మీకు నచ్చవచ్చు
ఐకాన్ స్టార్ 25 వ సినిమా: ఆకాశమే హద్దురా!
[Bhogi. sharwanandh, Anupama parameswaran, Dimple Hayathi, Sampath Nandi]




