TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

కొత్త ఇంటికి తోట వైకుంఠం అరుదైన పెయింటింగ్.. కాక పుట్టిస్తున్న ఎన్టీఆర్ ట్వీట్!

Nov 26, 2026 11:33AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి సంబంధించిన తాజా,క్రేజీ న్యూస్ వస్తే, సోషల్ మీడియా అభిమానుల స్పర్శ, సందర్శనతో ఎంతగా పులకరించిపోతుందో తెలిసిన విషయమే.  తాజాగా ఎన్టీఆర్  చేసిన ట్వీట్ తో అదేపనిలో బిజీగా ఉంది. 

ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం గీసిన అరుదైన ఒరిజినల్ పెయింటింగ్‌ని  ఎన్టీఆర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఇది సాధారణంగా కొనుగోలు చేసిన పెయింటింగ్ కాదు.. తన అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేకంగా వేయించుకున్న కళాఖండం కావడం విశేషం.

తెలంగాణకు చెందిన  తోట వైకుంఠం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పల్లెటూరి జీవనశైలి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ మహిళల రూపాలను తనదైన ప్రత్యేక శైలిలో కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరిస్తుంటారు. ఆయన చిత్రాలకు దేశవిదేశాల్లో మంచి గుర్తింపు ఉంది.

అలాంటి దిగ్గజ చిత్రకారుడితో ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ పెయింటింగ్ వేయించుకున్నాడు. తను కొత్తగా పునరుద్ధరించుకున్న ఇంటి కోసం ఈ ఒరిజినల్ కళాఖండాన్ని రూపొందించాలని కోరారు. దీంతో తోట వైకుంఠం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని తయారు చేసి  స్వయంగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి పెయింటింగ్‌ అందచేసాడు. 

ఇది కూడా చదవండి: Nanna Kutty Movie Review Telugu: నాన్న కుట్టి మూవీ రివ్యూ 

ఈ పెయింటింగ్‌లో శ్రీరాముడు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి గ్రామీణ నేపథ్యంలో కొలువై ఉన్నట్లుగా చిత్రీకరించారు. వారిని భక్తులు సంప్రదాయ దుస్తుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్న దృశ్యాలు  కనిపిస్తాయి. కిందివైపు సంప్రదాయ ముగ్గు కూడా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తోట వైకుంఠం ఎప్పటిలాగానే తనదైన గ్రామీణ కళాశైలిని  అద్భుతంగా ఆవిష్కరించారు. 

ఈ అరుదైన క్షణాలని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తోట వైకుంఠంతో కలిసి దిగిన ఫొటోలని,ప్రత్యేకంగా రూపొందించిన పెయింటింగ్‌ని  షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దిగ్గజ చిత్రకారుడి చేతుల మీదుగా రూపొందిన ఒరిజినల్ కళాఖండాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో సంతోషంగా, కృతజ్ఞతగా ఉందని పేర్కొనడంతో ఎన్టీఆర్  పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. 


సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్రశాంత్ నీల్ తో కలిసి ముస్తాబు చేస్తున్నాడు.  మొత్తానికి స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. మన తెలుగు కళాకారులని  ప్రోత్సహిస్తూ, సంప్రదాయ కళలపై తనకున్న ఆసక్తిని చాటుకుంటున్న ఎన్టీఆర్‌పై అభిమానులని వెనక్కి నెట్టి మరి   నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

మీకు నచ్చవచ్చు

వరుస ప్లాప్స్ అప్పుడు డైరెక్టర్ ఆవేశంగా మాట్లాడడు: హిట్ అయితేనేనా!

పవన్ కళ్యాణ్ పై భోగి డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్!

Ntr, Thota Vaikuntam, Painting, Dragan, Tollywood 

 

 

google-ad-img