Home

»

Latest News

జన నాయగన్ కి బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్: ముగ్గురు స్టార్ డైరెక్టర్ల సంచలన స్పీచ్!

Jul 22, 2026 4:38PM

 

ఇప్పుడు ఆల్  ఓవర్ ఇండియా విజయ్ జననాయగన్(Jana Nayagan)తో మారు మోగిపోతూ ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ నుంచే  షోస్ పడుతున్నా అంత కంటే ముందు బెనిఫిట్ షోస్ కూడా పడటంతో అభిమానులు ఇప్పుడిపుడే థియేటర్స్ వద్దకి చేరుకుంటున్నారు. తెలుగు నాట కూడా జన నాయకుడుగా వస్తుండటంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర న్యూస్ వాళ్లందరితో పాటు మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. 


జననాయగన్ లో విజయ్‌తో గతంలో పనిచేసిన ముగ్గురు స్టార్ దర్శకులు,  సర్‌ప్రైజ్ క్యామియో రోల్స్ లో కనిపించబోతున్నారు.  నేను జననాయగన్ లో  ఒక ప్రత్యేక పాత్రలో నటించినట్లు లోకేష్ కనకరాజ్ స్వయంగా ధృవీకరించాడు. హెచ్. వినోద్ మరియు విజయ్ ఇద్దరూ ఫోన్ చేసి అడగడంతోనే తాను ఈ క్యామియో చేయడానికి ఒప్పుకున్నానని ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. కేవలం లోకేష్ కనకరాజ్ మాత్రమే కాకుండా అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా  భాగం కానున్నారని సమాచారం. ఈ ముగ్గురు ప్రముఖ దర్శకులు చిత్రంలోని పోస్ట్-క్లైమాక్స్ లేదా కథలోని అత్యంత కీలకమైన ఘట్టంలో విలేకరులు (జర్నలిస్టులు)గా మెరవనున్నారనే వార్త సినీ ప్రియులను అమితంగా ఆశ్చర్యపరుస్తోంది. లోకేష్ కనకరాజ్ గతంలో విజయ్‌తో ‘మాస్టర్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్లు తెరకెక్కించగా,  ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి హ్యాట్రిక్ హిట్లు అట్లీ అందించాడు. అలాగే నెల్సన్ ‘బీస్ట్’ చిత్రాన్ని అందించిన విషయం తెలిసిందే.దీంతో  విజయ్ సినీ కెరీర్‌లో చెరగని ముద్ర వేసిన ఈ ముగ్గురు దర్శకులందరూ ఆయన చివరి సినిమాలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం భారతీయ చిత్రసీమలోనే ఒక మైలురాయిగా నిలవబోతోంది. 

Also read: అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎక్కడకి వెళ్ళాడో తెలుసా.. గెస్ చేసినా తెలుసుకోలేరు!

vijay, jana nayagan, lokesh kanagaraj, atlee, nelson dilip kumar


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com