Home

»

Latest News

మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం.. నేరుగా వెళ్లి ఓదార్చిన పవన్ కళ్యాణ్.!

Jul 22, 2026 4:24PM

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి కన్నుమూయడంతో మెహర్ రమేష్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. మెహర్ రమేష్ సోదరి చికిత్స పొందుతూ కన్నుమూసిన మణిపాల్ ఆస్పత్రికి ఆయన స్వయంగా వెళ్లారు. మణిపాల్ ఆస్పత్రికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడ ఉన్న మెహర్ రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాగా, మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ కుటుంబం బంధువులనే విషయం తెలిసిందే. మెహర్ రమేష్ అమ్మమ్మ, పవన్ తండ్రి సొంత అక్కాతమ్ముళ్ళు అవుతారు. 

 

 

Pawan Kalyan, Meher Ramesh, Sister Death, Telugu News

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com