Home

»

Latest News

'జన నాయగన్' ప్రీ-రిలీజ్ బిజినెస్.. హిట్ కావాలంటే అన్ని కోట్లు రావాలా.!

Jul 22, 2026 4:43PM

కోలీవుడ్ రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 23న గ్రాండ్ గా విడుదలవుతోంది. 

విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన సినిమా కావడంతో పాటు, ఆయన సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో.. 'జన నాయగన్'పై ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ క్రమంలోనే 'జన నాయగన్' సినిమా సాధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు, బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ సాధించడానికి కావలసిన టార్గెట్ లెక్కలు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో సుమారు 230 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలు పరిశీలిస్తే, హోమ్ మార్కెట్ అయిన తమిళనాడులో రికార్డు స్థాయిలో ఏకంగా 105 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. ఇక విజయ్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం 78 కోట్ల రూపాయల మైండ్ బ్లోయింగ్ బిజినెస్ నమోదు చేసింది. మిగతా దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 15 కోట్ల రూపాయలు, అలాగే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక వ్యాప్తంగా కలిపి మరో 30 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యుయేషన్ జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్' తన ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో బోణి కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

 

Thalapathy Vijay, Jana Nayagan, Jana Nayakudu, Business, Box Office

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com