
ప్రముఖ గజల్ గాయకులు డా. గజల్ శ్రీనివాస్ రూపొందించిన “శ్రీమద్భగవద్గీత – ఆంగ్ల ఆడియో ఆల్బమ్”ను మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ దంపతులు మారిషస్‌లోని శ్రీ హరిహర దేవస్థానం – కళాజ్యోతి ప్రాంగణంలో ఘనంగా లోకార్పణం చేశారు.
ఈ ఆడియో ఆల్బమ్‌లో శ్రీమద్భగవద్గీతలోని 700 శ్లోకాలను గజల్ శ్రీనివాస్ స్వరపరచి గానం చేశారు. కోల్‌కతాలోని అద్వైత ఆశ్రమానికి చెందిన శ్రీ స్వామి స్వరూపానంద అందించిన ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా తీసుకోగా, గీతా తాత్పర్యాలకు ఎన్. పార్థసారథి ఆంగ్లంలో స్వరాన్ని అందించారు.
ఈ సందర్భంగా మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ మాట్లాడుతూ, గజల్ శ్రీనివాస్ రూపొందించిన శ్రీమద్భగవద్గీత ఆంగ్ల ఆడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. “శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి శాశ్వత జీవన గ్రంథం” అని ఆయన అభివర్ణించారు. అదేవిధంగా, శ్రీమద్భగవద్గీతను ప్రపంచంలోని 100 భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గజల్ శ్రీనివాస్ చేపట్టిన పవిత్రమైన గ్లోబల్ గీతా ఉద్యమాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమాన్ని బృందావన పార్థసారథి సమన్వయం చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అతిథులుగా పాల్గొన్న అజయ్ గున్నెస్ – రోడ్లు భవనాల శాఖా మంత్రి, జ్యోతి జీతన్, ఆర్థిక శాఖా మంత్రి, సురేష్ సీబాలక్ – దేశ ప్రధాన కార్యదర్శి తదితరులకు మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ శ్రీమద్భగవద్గీత ఆడియో పెన్‌డ్రైవ్‌లను అందజేశారు.
ఇది కూడా చదవండి: డింపుల్ హయాతి జన్మ ధన్యం.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూచిపూడి నృత్యం
భారతీయ ఆధ్యాత్మిక సంపద తన గానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో గజల్ శ్రీనివాస్ చేపట్టిన గ్లోబల్ గీతా మిషన్లో ఈ ఆంగ్ల శ్రీమద్ భగవద్గీత ఆడియో ఆల్బమ్ లోకార్పణం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
మీకు నచ్చవచ్చు:
ఉపాసన తాతయ్యకు అరుదైన కానుక.. ఆ శ్రీరాముడి విగ్రహం వెనుక ఇంత కథ ఉందా?
ఇండియాస్ రియల్ జేమ్స్ బాండ్.. RAW వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఇతనే.!
[Shrimad Bhagavad Gita English Audio Album, Shrimad Bhagavad Gita English, Srimad Bhagavad Gita Album, Ghazal Srinivas, Mauritius President, Telugu Film News, Telugu News]






