
నాచురల్ స్టార్ నాని తన ప్యారడైజ్ మూవీ ప్రీమియర్ ని హైదరాబాద్ నగరంలో సినీ ప్రేమికులకి హార్ట్ లాంటి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లలో సాధారణ ప్రేక్షకులతో కలసి చూడాలని ఉంది. అన్ని రూల్స్ ఫాలో అవుతాను. పర్మిషన్ ఇస్తారా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 'ఎక్స్' వేదికగా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
నాని చేసిన ఈ ప్రత్యేక అభ్యర్థనపై రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఎక్స్ వేదికగా స్పందిస్తు' . పర్మిషన్ కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు దాఖలు చేయాలని, సంబంధిత భద్రతా అధికారులు ఆ అప్లికేషన్‌ను పరిశీలించి, అక్కడి శాంతిభద్రతలు మరియు ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేయడం జరిగింది. ప్యారడైజ్ రిలీజ్ డేట్ రేపే అయినా ఈ రోజు నైట్ నుంచే తెలంగాణ వ్యాప్తంగా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
ఇది కూడా చదవండి: డింపుల్ హయాతి జన్మ ధన్యం: తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూచిపూడి నృత్యం
[Nani, Cm Revanth Reddy, The Paradise, Benifit Show Permission, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






