Home

»

Latest News

ఫ్లాప్ అయినా హిట్‌ అని బిల్డప్ ఇచ్చే ట్రెండ్.. అసలు తప్పు ఎవరిది?

Oct 5, 2026 12:03PM


చిత్ర పరిశ్రమ. వరల్డ్ లోనే అత్యంత ఖరీదైన పరిశ్రమ. వినోదాన్ని, సందేశాన్ని టన్నుల కొద్దీ అందించడమే చిత్ర పరిశ్రమ లక్ష్యం. ఇక ప్రేక్షకులకి నచ్చితే కనుక వద్దంటే డబ్బు, స్టార్ స్టేటస్ పోటీపడుతు మరి నేను ముందంటే నేను ముందు అంటాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రమైన వాళ్ళుంటారు. వాళ్లే మేకర్స్ .

తమ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచినా, ప్రేక్షకులు తిరస్కరించినా సరే, దర్శక నిర్మాతలు మాత్రం "మా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్" అంటూ ఘనంగా విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రెండో రోజే థియేటర్ లోపల కనీసం పదిమంది కూడా లేక, కోట్ల రూపాయల నష్టాలు వచ్చినా 100 కోట్లు, 200 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్లు వేసి ప్రచారం చేసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఒకప్పుడు సినిమా ఆడిందో లేదో థియేటర్లలో కనిపించే జనం, ఆడే రోజులను బట్టి తేలిపోయేది. కానీ ఈ డిజిటల్ యుగంలో వాస్తవాన్ని కప్పిపుచ్చి, సోషల్ మీడియా పబ్లిసిటీతో సినిమాని హిట్ అని నమ్మించే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యవహారం చూస్తున్న సగటు సినిమా అభిమానికి అసలు సినిమాలో విషయాన్నే వదిలేసి, ఇలాంటి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అనుమానం కలగడం సహజం.

అసలు కథను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం భారీ తారాగణం, మైండ్ బ్లాకింగ్ విజువల్ ఎఫెక్ట్స్, పబ్లిసిటీ హడావుడితో మాత్రమే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించవచ్చనే ఆలోచనతో కొందరు నిర్మాతలు, దర్శకులు ముందడుగు వేస్తున్నారు. 50 కోట్ల బడ్జెట్‌‌తో తీసిన సినిమాలో అసలైన కథా బలం లేకపోతే, ప్రేక్షకుడు 150 లేదా 200 పెట్టి టికెట్ కొని థియేటర్‌కు వచ్చినప్పుడు ఆశాభంగం చెందుతున్నాడు. మొదటి రోజే 70 శాతానికి పైగా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం తమ సినిమా 90 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని అబద్ధపు గణాంకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకు 50 శాతానికి పైగా నష్టాలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిందంటూ నకిలీ కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా తమ తప్పును ఒప్పకోకుండా ఉండడం వల్ల పరిశ్రమకు ఎంతమాత్రం మంచిది కాదు.


ఇది కూడా చదవండి:  మహేష్ సరసన హాలీవుడ్ భామ! కాలర్ ఎత్తుతున్న ఫ్యాన్స్

 

 

దర్శక నిర్మాతలు తమ పొరపాట్లను లేదా సినిమా ఫ్లాప్‌ను ఎందుకు అంగీకరించడం లేదనే ప్రశ్నకు ప్రధానంగా బిజినెస్ సమీకరణాలే సమాధానంగా నిలుస్తున్నాయి. సినిమా ప్లాప్ అని ఒప్పుకుంటే డిజిటల్ ఓటీటీ హక్కులు, శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రీ-రిలీజ్ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయం వారిని వెంటాడుతోంది. ఓటీటీ సంస్థలు సినిమా టాక్‌ను బట్టి డీల్స్ కుదుర్చుకోవడమో లేదా వ్యూయర్ షిప్ ఆధారంగా రెవెన్యూ మోడల్స్ మార్చడమో చేస్తున్నాయి. దీనికితోడు హీరోల ఇమేజ్, తదుపరి సినిమాల బిజినెస్ మార్కెట్ పడిపోకుండా ఉండేందుకు ఫేక్ కలెక్షన్ల డ్రామా అనివార్యంగా మారుతోంది. 80 శాతం సందర్భాల్లో ప్రొడ్యూసర్లు తమ తదుపరి ప్రాజెక్టుల పెట్టుబడుల కోసం ఈ 'హైప్' అనే మాయాజాలాన్ని వాడుకుంటున్నారు. కథనం లోపాలను సరిదిద్దుకోవడం మానేసి, తమ ఈగోలను కాపాడుకోవడానికి ప్రెస్ మీట్లలో ప్రేక్షకుల తీర్పునే ప్రశ్నించే స్థాయికి వెళ్లడం విచారకరం.

బలమైన కథ, నేటివిటీకి దగ్గరగా ఉండే భావోద్వేగాలు ఉన్నప్పుడు మాత్రమే రూపాయి పెట్టుబడికి వంద రూపాయల లాభం వస్తుంది. కేవలం ప్రచారంతో ఫ్లాప్ సినిమాను హిట్ చేయలేరనే నిజాన్ని సినీ ప్రముఖులు ఇప్పటికైనా గ్రహించాలి. అసలు కథ, కథనాన్ని  గాలికి వదిలేసి సీన్స్ ని తెరకెక్కించి సినిమా నిర్మించడం ఏంటి? ప్లాప్ అని ఒప్పుకోవడం ఏంటి? అందుకే అంటారు పైత్యం అనేది ఎవరి సొంతం కాదు? కొంత అంది మేకర్స్ కూడా తమ సొంతం అంటారని సినీ అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.  

 

 

[Telugu Movies Flop To Hit Buildup Trend, Telugu cinema box office truth, fake collection posters culture, why movies fail in tollywood,Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com