Home

»

Latest News

నయనతారకి షాక్ లపై షాక్‌లు.. క్రేజ్ ఉంది కానీ...!

Nov 10, 2026 1:32PM


హీరోలకి మేము ఎందులోను తీసిపోము అనే రీతిలో నయనతార లేడీ సూపర్ స్టార్ హోదాలో తన చరిష్మాని సుదీర్ఘ కాలం నుంచి కొనసాగిస్తూ వస్తుంది. బడా హీరోలు ఏరి కోరి తమ సినిమాలో నయన్ ఉండాలని పట్టుబడతారంటే ఆ కట్ అవుట్ కెపాసిటీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.  


ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద  మంచి విజయాన్ని సాధించి  ఘనమైన ఆరంభాన్నిచ్చింది.కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లను సాధించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ సుందర్ సి దర్శకత్వంలో ఈ నెల 6 న రిలీజైన డివోషనల్ డ్రామా 'మూకుత్తి అమ్మన్ 2' (మహాశక్తి) చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.

దీపావళి సీజన్‌లో విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, తొలి వారాంతం ముగిసినా కనీసం 10 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా దాటలేకపోవడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. దీనికి తోడు ఆగస్టు నెలలో విడుదలైన 'హాయ్' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది.

కెమెరా ముందు నటిగా మాత్రమే కాకుండా, కెమెరా వెనుక నిర్మాతగా తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' (LIK) సైతం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.  

ఇది కూడా చదవండి: ఆ హీరో స్టార్ పవర్ అదుర్స్: వాళ్ళు దాన్నే ఫాలో అవ్వాలి..వర్మ వ్యాఖ్యలు వైరల్ 

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యష్ 'టాక్సిక్' చిత్రంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆ సినిమా ఫలితం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో నయన్ మార్కెట్ సమీకరణాలపై చర్చ మొదలైంది. 

సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్, భారీ రెమ్యునరేషన్లు ఉన్నప్పటికీ ఆ క్రేజ్ ఇప్పుడు థియేటర్లలో టికెట్లుగా, కలెక్షన్లుగా మారడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, కేవలం కొన్ని చిత్రాల ఫలితాలతో టాలెంటెడ్ నటి అయిన నయనతార స్టార్‌డమ్‌ను తక్కువ అంచనా వేయలేమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రానున్న ప్రాజెక్ట్‌లతో ఆమె స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

 

మీకు నచ్చవచ్చు :నరకానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది
మీకు నచ్చవచ్చు:మళ్ళీ వస్తాయా? ఆ అద్భుతమైన మ్యూజికల్ హిట్ చిత్రాలు!

 

[Nayanthara Recent Box Office Failures, Nayanthara, Lady Superstar, Mookuthi Amman 2, Box Office Failures, Nayanthara movies, Tollywood news, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com