
సుప్రీత... ప్రముఖ సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమై, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉంది. హీరోయిన్ గాను చేస్తున్న సుప్రీత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నాకు ఫ్యాన్స్ ఉంటారని నిరూపిస్తూ ఉంది.
అయితే బయటకి ఎంతో ఉత్సాహంగా, గ్లామరస్‌గా కనిపించే సుప్రీత జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో చేదు అనుభవాలు, తీవ్రమైన మనోవేదన దాగి ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ప్రేమ జీవితం, ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి గురించి ఆమె విప్పిన నిజాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన జీవితంలో ఇప్పటివరకు ఏకంగా మూడు సార్లు బ్రేకప్స్ జరిగాయని సుప్రీత ఓపెన్‌గా వెల్లడించారు. అయితే అందులో మొదటి ప్రేమను తాను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని, అది చిన్నతనంలో కలిగిన ఒక సాధారణ క్రష్ మాత్రమే. కానీ రెండో రిలేషన్‌షిప్ ముగిసిన తీరు మాత్రం తన మనస్సుపై ఆరని ముద్ర వేసిందని తెలిపారు. ఆ సమయంలో అనుభవించిన తీవ్రమైన మానసిక ఒత్తిడి, వేదన తర్వాతి కాలంలో ప్రారంభమైన మూడో బంధంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించిందని సుప్రీత వివరించారు.
మూడో రిలేషన్‌షిప్ ప్రారంభంలో చాలా అందంగా, ఆనందంగా ఉన్నప్పటికీ.. రోజులు గడిచేకొద్దీ అది తన జీవితంలో ఒక పెద్ద నరకంగా మారిపోయిందని ఆమె అన్నారు. ముఖ్యంగా మూడో భాగస్వామిలో కనిపించిన విపరీతమైన అనుమానం, ఈగో వంటి ధోరణులు తనను నిమిష నిమిషానికి తీవ్ర ఇబ్బందికి గురిచేసేవని సుప్రీత పేర్కొన్నారు. తాను షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు లేదా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు 'ఎవరితో మాట్లాడుతున్నావు?', 'ఆ వ్యక్తితో ఎందుకు అంతసేపు మాట్లాడావు?' అంటూ ప్రతి చిన్న విషయానికి ప్రశ్నలు ఎదురయ్యేవని ఆమె గుర్తుచేసుకున్నారు. తన స్వేచ్ఛను హరించేలా సాగిన ఆ నిరంతర నియంత్రణ, అనుమానాలు తనను మానసికంగా కుంగదీశాయని చెప్పారు. చివరికి ఆ విషపూరితమైన సంబంధం తన సినీ కెరీర్‌పైనా ప్రతికూల ప్రభావం చూపడం ప్రారంభించడంతో, ఇక భరించలేక ఆ బంధం నుంచి పూర్తిగా బయటకు రావాలని నరకం లాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఫ్లాప్ అయినా హిట్ అని బిల్డప్ ఇచ్చే ట్రెండ్.. అసలు తప్పు ఎవరిది?

వరుసగా ఎదురైన ఈ లవ్ బ్రేకప్స్ సుప్రీత ఆరోగ్యాన్ని, శారీరక స్థితిని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ప్రతి నిమిషం అతిగా ఆలోచించడం, ఒంటరిగా గంటల తరబడి ఏడవడం వల్ల ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లోకి జారుకున్నారు. ఈ మానసిక క్షోభ కారణంగా తిండి తిప్పలు మానేయడంతో ఆమె శరీర బరువు గణనీయంగా పడిపోయి, ఒకానొక దశలో కేవలం 52 కిలోలకు తగ్గిపోయారు. విపరీతమైన నీరసంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో చివరకు ఆస్పత్రి వరకు వెళ్లాల్సి వచ్చిందని సుప్రీత తెలిపారు. శరీరంలో శక్తి లేక అంతలా చిక్కిపోవడంతో, చుట్టుపక్కల వాళ్లు మరియు బంధువులు కూడా 'ఎందుకు అంతలా సన్నబడిపోయావు?' అని తిట్టేవారని ఆమె బాధపడ్డారు. ప్రస్తుతం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు డాక్టర్ల సలహాతో క్రమం తప్పకుండా మందులు వాడుతుప్రతిరోజూ మెడిటేషన్ చేస్తూ మానసిక ప్రశాంతతని పొందేందుకు ప్రయత్నిస్తున్నానని సుప్రీత స్పష్టం చేశారు. ఆమె చెప్పినదాన్ని బట్టి చూస్తే బ్రేక్ అప్, అనుమానం అనేవి తోడుదొంగలనే విషయం అర్ధమవుతుంది.
[supritha About Her Love Breakup, supritha love breakup news viral, Actress Supritha, Supritha Breakup Story, Surekha Vani Daughter, Telugu Cinema News, Telugu cinema, Tollywood News, Tollywood]
.webp)





