శ్రీహరి కుమారుడికి ఆఫర్లే ఆఫర్లు
on May 13, 2020
ప్రతిభకు విజయాలు కొలమానం కాదని చెబుతుంటారు. కొన్నిసార్లు అవకాశాలు రావడం ఆలస్యం కావచ్చు. కానీ, అవకాశాలు రావడం మాత్రం పక్కా అని చెప్పడానికి శ్రీహరి కుమారుడు ఒక ఉదాహరణ. 'రాజ్‌దూత్' సినిమాతో దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ తెరంగేట్రం చేశాడు. హీరోగా మొదటి సినిమా ఆశించిన విజయం సాధించినప్పటికీ అతడికి ఆఫర్లు బాగా వస్తున్నాయి. లాక్డౌన్ టైమ్‌లోనూ అతడు రెండు సినిమాలు ఓకే చేశాడు.
మారుతి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ముని దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ చేయడానికి మేఘాంశ్ ఓకే చెప్పాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'కి వీఐ ఆనంద్ దగ్గర చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన రాజేష్ చెప్పిన కథకూ మేఘాంశ్ ఓకే చెప్పాడట. అతడిని హీరోగా పరిచయం చేసిన ఎమ్ఎల్వి సత్యనారాయణ, లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది.
మేఘాంశ్ శ్రీహరి రెండో సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ అయితే... ఈ మూడో సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అట. రెండో సినిమా కంప్లీట్ అయినా తర్వాతే మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. లాక్డౌన్ ముగిసిన తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడం ప్రారంభిస్తారట. ప్రస్తుతం దర్శకుడు రాజేష్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారట.