స్టార్ట్ స్టేటస్‌తో పవన్ హంగామా చేస్తాడా?
on May 13, 2020
పవన్‌కల్యాణ్‌ను అభిమానులు ముద్దుగా పవర్‌స్టార్ అని పిలుస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ పిలుపు ముందు జనసేనాని చేరింది. ఎవరు ఎలా పిలిచినా ఆయన సాదాసీదాగా ఉంటారు. తెరపై పాత్రలకు తగ్గట్టు స్టయిలిష్‌గా, రిచ్‌గా కనిపించడం తప్ప బయట ఎక్కడా స్టార్ స్టేటస్ చూపించారు. అయితే తెరపై తొలిసారి స్టార్ట్ స్టేటస్ చూపించడానికి రెడీ అవుతారా? స్క్రీన్ మీద పవర్‌స్టార్‌గా తన ఇమేజ్ ఎంత ఉందో, ఎంత పవర్‌ఫుల్ అనేది చూపించడానికి రెడీ అవుతారా? అన్నీ కుదిరితే అవుతారని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
మలయాళంలోమంచి విజయం సాధించిన 'డ్రైవింగ్ లైసెన్స్'ను, తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని అగ్ర నిర్మాత ఒకరు ప్రయత్నిస్తున్నారని సమాచారం. పవర్‌స్టార్‌ని మలయాళ సినిమా చూడమని నిర్మాత రిక్వెస్ట్ చేశారట. మీకు నచ్చితే సినిమా చేద్దామని ప్రతిపాదన పవన్ ముందు ఉంచారట. 'డ్రైవింగ్ లైసెన్స్' కథ విషయానికి వస్తే... యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన ఒక స్టార్ హీరో డ్రైవింగ్ లైసెన్స్ మిస్ అవుతుంది. ఒక సినిమా షూటింగుకు లైసెన్స్ అవసరం అవుతుంది. మళ్లీ కొత్తగా లైసెన్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఆర్టీఓ ఆఫీసులో అధికారి ఆ హీరో అభిమాని. ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ ఎంత పని చేసింది? హీరోని ఎంత దూరం తీసుకువెళ్ళింది? అనేది కథ. 'డ్రైవింగ్ లైసెన్స్'లో పృథ్వీరాజ్ సుకుమారన్ స్టార్ హీరోగా నటించారు. తెలుగులో ఆ రోల్ చేయవలసిందిగా పవన్ దగ్గరకు ప్రతిపాదన వెళ్లింది. ఆయన ఏమంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
