నాని మరో సినిమాకు సంతకం చేశాడు
on May 13, 2020

నాచురల్ స్టార్ నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో 'వి', శివ నిర్వాణ డైరెక్షన్‌లో 'టక్ జగదీశ్' మూవీస్ చేస్తోన్న అతను 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చేయనున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి పనిచేయడానికి అతను సరేనన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా 'శ్యామ్ సింగ రాయ్' మూవీ షూట్ ముగిసిన వెంటనే మొదలయ్యే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్ ముగిసి, షూటింగ్స్ మొదలయ్యాక 'టక్ జగదీశ్' సెట్స్‌పైకి వెళ్లనున్నాడు నాని.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన 'వి' మూవీ థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ కానున్నది. వాస్తవానికి అది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన విషయం మనకు తెలిసిందే. నిజానికి 'శ్యామ్ సింగ రాయ్' మూవీ కూడా ఈ ఏడాదే విడుదల కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే అవకాశాలు లేవు కాబట్టి, ఆ సినిమాతో పాటు వివేక్ ఆత్రేయ సినిమా కూడా 2021లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఊహించవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా విరామం లేకుండా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న నానికి కొవిడ్-19 లాక్‌డౌన్ బాగా ఇబ్బంది పెట్టింది. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' సినిమాలతో న్యూ ఏజ్ డైరెక్టర్‌గా వివేక్ ఆత్రేయ అందరి ప్రశంసలూ పొందాడు. నానితో అతను తెరపై ఎలాంటి ఆటలు ఆడిస్తాడన్నది ఆసక్తికరం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



