రానాకు శ్రీరెడ్డి అభినందన!
on May 14, 2020
సంచలన స్టేట్మెంట్లతో, టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై కామెంట్లతో మోస్ట్ కాంట్రవర్షియల్ టాలీవుడ్ పర్సనాలిటీగా శ్రీరెడ్డి పేరు పొందింది. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసి, ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించిన వివరాలను ఆమె వెల్లడించింది. సోషల్ మీడియాలో చాలా కాలంగా ఆమె అనేక వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తోంది. అలాంటి శ్రీరెడ్డి ఒక యాక్టర్‌పై పాజిటివ్‌గా స్పందించడం గమనార్హం. ఆ నటుడు రానా దగ్గుబాటి. డిజైనర్ మిహీకా బజాజ్‌తో రానా పెళ్లి నిశ్చయమైంది. ఆ జంటను ఫేస్బుక్ ద్వారా అభినందించింది శ్రీరెడ్డి.
"I know rana garu how much u gone through..god bless u with the peaceful life with ur girl." అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఇది అనేకమందికి ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి రానా తమ్ముడు అభిరామ్‌తో తనకు ఎఫైర్ ఉందని ఫొటోల ద్వారా శ్రీరెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల అభిరామ్ గురించి మరోసారి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఇదివరకు నాని, విశాల్, రాఘవ లారెన్స్, సుందర్ సి., కొరటాల శివ సహా పలువురిపై ఆమె ఆరోపణలు చేసింది.