త్రిష దృష్టిలో ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ ఆ ముగ్గురే!
on May 14, 2020
కథానాయికగా త్రిష 50 చిత్రాల మైలురాయిని దాటేశారు. నటిగా ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో ఎంతోమంది కథానాయకుల సరసన ఆమె నటించారు. అలాగే గొప్ప గొప్ప నటీనటులతో కలిసి ఆమె పనిచేశారు. అందాల భామగా మాత్రమే కాకుండా నటిగానూ త్రిష గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, ఆమె దృష్టిలో ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా?
1) కమల్ హాసన్
2) మోహన్ లాల్
3) ఆమిర్ ఖాన్
'ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ ఎవరు?' అనే ప్రశ్నకు త్రిష చెప్పిన సమాధానం అది. హిందీలో త్రిషకు కథానాయికగా అవకాశం ఇచ్చిన అక్షయ్ కుమార్ పేరును ఆమె చెప్పలేదు. అలాగే దక్షిణాదిలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. వాళ్ల పేర్లు కూడా త్రిష చెప్పలేదు. సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నించకుండా తన మనసులో మాటను చెప్పినందుకు ఆమెను మెచ్చుకోవాలి. అదే సమయంలో ఆమెను మిగతా హీరోల ఫ్యాన్స్ ఏ విధంగా ట్రోల్ చేస్తారో అనే ఆందోళన కూడా త్రిష అభిమానుల్లో ఉంది.