
హీరోయిన్స్ కి సంబంధించిన కొన్ని న్యూస్ వింటే పక్కనున్న వాళ్ళని నేను చదువుతుంది కల, నిజమా అని తెలియడానికి గిల్లమని అడిగే పరిస్థితి. ఒళ్ళు జలదరిస్తుంది కూడా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం అగ్రకథానాయికగా దూసుకుపోతున్న ఆమెకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆలియా భట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అలాగే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఆమె తల్లి, సీనియర్ నటి సోనీ రజ్దాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఏకంగా రోజుకి 100 సిగరెట్లు కాల్చాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ తెరకెక్కించిన 'గుమ్రా' చిత్రం 1993లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో సోనీ రజ్దాన్ కీ రోల్.అయితే ఆ సమయంలో ఆమె తన రెండవ గర్భం దాల్చారనే విషయం ఆమెకు అసలు తెలియదట.

తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియకముందే, చిత్రంలో భాగంగా ఒక ప్రత్యేకమైన ధూమపాన సన్నివేశంలో ఆమె నటించాల్సి వచ్చింది. ఈ సీన్ కోసం ఆమె ఏకంగా ఒకే రోజులో సుమారు 100 సిగరెట్లని కాల్చవలసి వచ్చిందని స్వయంగా ఆమె నవ్వుతూ తెలిపారు. ఆ సమయంలో తన గర్భంలో ఉన్నది ఎవరో కాదు.
ఇది కూడా చదవండి: అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న కలెక్షన్స్: ధురంధర్ 2 ని దాటిందనే దానిపై అసలు కలెక్షన్స్ బయటకి!
ప్రస్తుతం బాలీవుడ్‌ని ఏలుతున్న ఆలియా భట్ అని సోనీ రజ్దాన్ పేర్కొన్నారు. తాను సాధారణంగా సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వ్యక్తి కాదని, కానీ షూటింగ్ అనుభవం తర్వాత తనకు నిజంగానే సిగరెట్లు తాగాలనే కోరిక (హంబల్) పుట్టిందనే ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు. కేవలం సిగరెట్ సీన్ మాత్రమే కాకుండా, తాను గర్భవతిగా ఉన్న సమయంలోనే ఒక క్లిష్టమైన ఉరిశిక్ష (ఫాషింగ్) సన్నివేశాన్ని కూడా షూట్ చేసినట్లు తెలిపారు.

ఆ తర్వాత సుమారు ఐదు నెలల విరామం తరువాత తిరిగి షూటింగ్ సెట్స్‌కు వచ్చేసరికి తన దుస్తులు సరిపోలేదని, అప్పటికే కడుపు కొద్దిగా బయటకు రావడంతో కాస్ట్యూమ్స్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందని ఆమె నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి కాలంతో పోలిస్తే నేడు చిత్ర పరిశ్రమలో మాతృత్వం పట్ల ఎంతో మార్పు వచ్చిందని, నేడు నటీమణులు తమ ప్రెగ్నెన్సీని దాచిపెట్టాల్సిన అవసరం లేకుండా పని చేయగలుగుతున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలియాభట్ తండ్రి బాలీవుడ్ లో అగ్ర దర్శకుడు మహేష్ భట్ అని తెలుగులో మూడుదశాబ్దాల క్రితమే కింగ్ నాగార్జున తో క్రిమినల్ మూవీ కూడా తెరకెక్కిచాడనే విషయం తెలిసిందే.
మీకు నచ్చవచ్చు: విజయ్ దేవరకొండ రీసెంట్ పోస్ట్ వైరల్!
మీకు నచ్చవచ్చు: కల్కి 2 ఆ ఏరియాలో బిజినెస్ ఇంతే: ఎందుకని ఇలా!
[Soni Razdan, Alia Bhat, Mahesh Bhat, Bollywood, Tollywood]






