
విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'రణబాలి'తో తన జోరు చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి చిత్రంగా 'రౌడీ జనార్ధన' ని రెడీ చేస్తున్నాడు. దిల్ రాజ్ నిర్మాత కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్ గా దేవరకొండ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేవరకొండ అండ్ వైఫ్ రష్మిక మందన్నాకి సంబంధించిన లేటెస్ట్ జపాన్ వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతు ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ఇస్తున్నాయి. రకరకాల విమర్శలకు దూరంగా, తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్న ఈ జోడి ఫోటోలు చూసేందుకు చాలా క్యూట్‌గా ఉన్నాయి.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్‌కు ఇచ్చిన "మైన్ (Mine)", "హోమ్ (Home)", మరియు "లవ్ (Love)" అనే మూడు సింపుల్ అండ్ స్వీట్ క్యాప్షన్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ ట్రిప్‌లో కేవలం ఇద్దరే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. జపాన్ వీధుల్లో అందరూ కలిసి సరదాగా తిరుగుతూ, కాఫీ మరియు మచ్చా బ్రేక్స్ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ అన్నీ ఈ ఫోటోల ద్వారా బ్యాలెన్స్‌డ్‌గా బయటికి వచ్చాయి. ఒక ఫ్రేమ్‌లో విజయ్ తన తలతో రష్మిక భుజంపై ఆనుకొని కనిపించగా, "హోమ్" అనే క్యాప్షన్ ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మరో ఫోటోలో రష్మిక నవ్వుతుండగా విజయ్ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా హగ్ చేసుకున్న పిక్‌కు "లవ్" అని రాసుకొచ్చారు.
.webp)
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఈ క్యూట్ కపుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మరోవైపు ఈ జపాన్ వెకేషన్‌లో కేవలం రొమాంటిక్ మూమెంట్సే కాకుండా, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడిపిన ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక ఫోటోలో విజయ్ కుటుంబం అంతా కలిసి సరదాగా కలరింగ్ సెషన్‌లో బిజీగా కనిపించగా, మరికొన్ని పిక్స్‌లో జపనీస్ ఫుడ్ కల్చర్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. ముఖ్యంగా రష్మిక మందన్నా జపనీస్ సోఫ్ట్ సోఫ్లే ప్యాన్‌కేక్స్ తయారీని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఫోటోలు, అలాగే నోరూరించే మోచీ (Mochi) రైస్ కేక్‌ను ఆస్వాదిస్తున్న క్షణాలు ట్రిప్ హైలైట్‌గా నిలిచాయి. అంతేకాకుండా, విజయ్ తన తల్లిగారితో కలిసి దిగిన ఒక చిలిపి ఫోటోను షేర్ చేస్తూ, "అమ్మ సన్ రష్మిక హార్ట్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అంటూ ఫన్నీ క్యాప్షన్ జోడించడం అందరినీ నవ్విస్తోంది.
ఇది కూడా చదవండి: కల్కి 2 నైజాం హక్కులని దక్కించుకున్న ఆ ఇద్దరు..అమౌంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
ఈ ట్రిప్ మధ్యలో కేవలం విహారయాత్రే కాకుండా, విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంప్రదాయాన్ని మరువకుండా దీపావళి పర్వదినాన ఒక ప్రత్యేకమైన హోమం (Goma Ritual) నిర్వహించినట్లు విజయ్ వెల్లడించారు.
దేవరకొండ కుటుంబం తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ వారు జపనీస్ గడ్డపై నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ జపాన్ వెకేషన్ ఫోటోల్లో రష్మిక మందన్నా స్టైలిష్ లుక్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చేతిలో కత్తి పట్టుకుని ఆమె కనిపించిన ఒక డిఫరెంట్ స్టిల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
.webp)
రష్మిక అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'మైసా' (Mysaa) సినిమాలోని లుక్‌ని ఇది తలపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా, నవంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండటంతో, ఈ ట్రిప్ ఫోటోలు సినిమాకి మంచి హైప్ తీసుకొస్తున్నాయని చెప్పవచ్చు.
మీకు నచ్చవచ్చు:పవన్ కళ్యాణ్,అన్నా లెజినోవా విడాకులు: సంచలన అప్ డేట్!
మీకు నచ్చవచ్చు:ప్రముఖ డైరెక్టర్ పై హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్!
[Vijay Deverakonda, Rashmika Mandanna, Japa Pics, Ranabhali, Tollywood]






