Home

»

Latest News

కల్కి 2 నైజాం హక్కులని దక్కించుకున్న ఆ ఇద్దరు..అమౌంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Nov 16, 2026 12:04PM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి సరైన సినిమా పడితే ప్రభాస్ అనే కట్ అవుట్ పాన్ వరల్డ్ మొత్తం ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో మరోసారి రుజువయ్యింది. 


మొదటి భాగం ఇచ్చిన అంచనాలతో, ఇప్పుడు 'కల్కి 2' సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే సినిమా విడుదలకు ముందే ట్రేడ్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ముఖ్యంగా 'కల్కి 2' సినిమాకు సంబంధించి నైజాం ప్రాంత థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయన్న వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలైన ఏషియన్ సునీల్, సురేష్ బాబు సంయుక్తంగా 'కల్కి 2' నైజాం హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్ ఏకంగా 108 కోట్ల భారీ ధరకి క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ ,షూటింగ్ దశల్లోనే ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో నైజాం హక్కులు అమ్ముడవడం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తోంది. 

అయితే, ఈ భారీ మొత్తంలో ఎలాంటి రిస్క్ లేని విధంగా రికవరబుల్ మోడల్ పద్ధతిలో ఈ ఒప్పందం కుదిరినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నాన్-రికవరబుల్ అడ్వాన్స్‌లతో పోలిస్తే, ఈ రికవరీ మోడల్ విధానం వల్ల బయ్యర్లకు భద్రత ఉంటుందని, నిర్మాతకూ వడ్డీ లేని పెట్టుబడిలాంటి భరోసా లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్!

మొదటి భాగంలో ప్రభాస్ అద్భుత నటనతో పాటు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పోషించిన విలన్ పాత్ర 'సుప్రీమ్ యాస్కిన్' సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. సీక్వెల్‌లో కమల్ హాసన్ పాత్ర మరింత శక్తివంతంగా ఉండనుండటంతో పాటు, కథాంశంపై భారీ అంచనాలున్నాయి. ఈ కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద కనీస అంచనాలను అందుకున్నా, బయ్యర్లకి సుమారు  20 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం నైజాం మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నప్పటికీ, మేకర్స్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎంతో ముందుగానే ఈ భారీ డీల్‌ను పూర్తి చేయడం విశేషం. ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, 'కల్కి 2'పై ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈ సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ బాక్సాఫీస్ వద్ద మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని స్పష్టమవుతోంది.

 

మీకు నచ్చవచ్చు: పవన్ కళ్యాణ్ విడాకులపై ప్రముఖ యాంకర్ వ్యాఖ్యలు వైరల్! 
మీకు నచ్చవచ్చు:ప్రీతి ముకుందన్ కొత్త మూవీ ఓటిటిలోకి! 

 

[Kalki 2, Prabhas,  Nizam rights, Nag Ashwin, Amithabachchan, Dil raju, Sunil Narang]
  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com