Home

»

Latest News

sivakarthikeyan: సినిమాల్లో ఛాన్స్ పేరుతో మోసాలు.. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ ఘనతనా!

May 11, 2026


అప్ డేట్ అనేది మోసానికి కూడా వర్తిస్తుంది. అందుకే పలు దారుల్లో మోసాలు ఎక్కువ అయ్యాయి. మరి సదరు మోసం  తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న శివకార్తికేయన్‌( sivakarthikeyan)ని పలకరిస్తే ఏమవుతుంది. అలర్ట్ అయ్యాడు. మనల్ని అలర్ట్ చేసాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం.

శివకార్తికేయన్‌  నటుడిగానే కాకుండా 'శివకార్తికేయన్‌ ప్రొడక్షన్స్‌' బ్యానర్‌పై వరుసగా విభిన్నమైన చిత్రాలని నిర్మిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆయన నిర్మాణ సంస్థ పేరును వాడుకుంటూ కొందరు కేటుగాళ్లు అమాయక నటీనటులని ఆడిషన్ పేరుతో  మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌ ప్రొడక్షన్స్‌ సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది 

సదరు ప్రకటనలో  సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న యువతీ యువకులని  లక్ష్యంగా చేసుకుని కొందరు ఫేక్ క్యాస్టింగ్ ఏజెంట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌లో తదుపరి సినిమాలకి  నటీనటులు కావాలంటూ, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది. తమ సంస్థ ఎప్పుడూ నటీనటుల ఎంపిక కోసం డబ్బులు అడగదు. ఇమెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దు.


Also read: ekalavya: అర్జునుడికి ఎదురైన ఘోర అవమానం. ఇలాంటి సన్నివేశం మీరెప్పుడు చూసి ఉండరు 

మా నిర్మాణ సంస్థ పేరుని  వాడుకుంటూ ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మా సినిమాల కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ మొత్తం అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే జరుగుతుందని పేర్కొంది  శివకార్తికేయన్ నే  స్వయంగా ఈ విషయాన్ని తన అభిమానులకి , ఔత్సాహిక నటులకు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరడం విశేషం. శివ కార్తికేయన్ పరాశక్తి మూవీతో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చి పరాజయాన్ని అందుకున్నాడు.

  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com