
కోలీవుడ్ లో 'మోస్ట్ సక్సెస్‌ఫుల్ పెయిర్'గా పేరు తెచ్చుకున్న దళపతి విజయ్ (Thalapathy Vijay), త్రిష (Trisha) గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్.. పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ, ఆ వేడుకలో త్రిష మెరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా ఆమె పెట్టిన ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఆదివారం ఉదయం జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో సంప్రదాయబద్ధంగా మెరిసిన త్రిష, హుందాగా కనిపించింది. విజయ్ ప్రమాణం చేస్తుండగా ఆమె కొంత భావోద్వేగానికి గురవ్వడం హైలైట్ గా నిలిచింది. ఇద్దరి మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది.
విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బ్లూ కలర్ శారీలో మెరిసిన త్రిష.. ఆ శారీలో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, "ప్రేమ ఎప్పుడూ గొప్పదే" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఎన్నికలకు ముందు మొదటి భార్యతో విడిపోయిన విజయ్.. త్రిషను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఎన్నికల ఫలితాల రోజు, ప్రమాణ స్వీకారం సమయంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇప్పుడు ఆమె చేసిన "లవ్" పోస్ట్ చూస్తుంటే.. త్వరలోనే వీరి పెళ్లి వార్తలు నిజం కాబోతున్నాయి అనిపిస్తోంది.






