Home

»

Latest News

సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం: క్షమాపణలు చెప్పాలని డిమాండ్..చెప్పేసారు!

Sep 25, 2026 10:50AM


సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం 'ది ప్యారడైజ్' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. పైగా ప్యారడైజ్ దగ్గర్నుంచి ఇక హీరోగా సినిమాలు చేయను, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతానని ప్రమోషన్స్ లో కూడా చెప్పాడు. కాకపోతే  ప్యారడైజ్ లో  తన క్యారక్టర్ వరకు న్యాయం చేసినా ఎడిటింగ్ లో చాలా సీన్స్ పోయాయని క్లియర్ గా అర్ధమవుతుంది. 


రీసెంట్ గా ఒక డిజిటల్  మీడియా ఛాన ల్‌లో  ఒక జర్నలిస్ట్ సంపూర్ణేష్ బాబుని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ అయిన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన దుమారం రేపింది.సదరు ఇంటర్వ్యూలో నాగేంద్ర కుమార్ అడిగిన కొన్ని ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. "అసలు నిన్ను పెట్టి ఎవరు తీస్తారు?"  అసలు ఏ పేస్ తో హీరో అవుదామని ఎలా వచ్చావని ప్రత్యక్షంగా ప్రశ్నించడంతో పాటు, పేదరికంలో ఉన్నవారు లేదా సాధారణ నేపథ్యం ఉన్నవారు సినీ పరిశ్రమలోకి రాకూడదా అనే అర్థం వచ్చేలా అనుచిత ప్రశ్నలు గుప్పించారు. ఎదురుగా జర్నలిస్ట్ ఎంతో అగౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ, సంపూర్ణేష్ బాబు మాత్రం ఎంతో శాంతంగా, సహనంతో, చెరగని చిరునవ్వుతో సమాధానాలు ఇస్తూ తన నమ్రతను చాటుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  సంపూర్ణేష్ బాబు అభిమానులు, సామాన్య ప్రేక్షకులు సదరు జర్నలిస్ట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూట్యూబ్‌లో దాదాపు 100% ప్రతికూల కామెంట్లు రావడం, వేలాది మంది నెటిజన్లు ఆ జర్నలిస్ట్ వైఖరిని ఖండిస్తూ రీవీడియోలు చేయడం ప్రారంభించారు.  

ఇది కూడా చదవండి: 'ది ప్యారడైజ్' ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్లు: రికార్డు స్థాయి వసూళ్లతో సునామీ

 


 పరిస్థితి తీవ్రతను గ్రహించిన  జర్నలిస్ట్  వెంటనే స్పందిస్తూ ఒక సుదీర్ఘ వివరణాత్మక వీడియో ద్వారా నటుడు సంపూర్ణేష్ బాబుకు, ఆయన అభిమానులకు బహిరంగంగా బేషరతు క్షమాపణలు తెలిపారు. ఇంటర్వ్యూ సమయంలో తన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని, కానీ సంభాషణ ప్రవాహంలో వాడిన పదాలు తప్పుగా వచ్చాయని ఒప్పుకున్నారు. సంపూర్ణేష్ బాబు యొక్క క్రమశిక్షణ, నటన పట్ల ఉన్న అంకితభావం, ఆయన స్వచ్ఛమైన మనస్సును తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. సంపూ పట్ల తాను ప్రదర్శించిన వైఖరి సరైనది కాదని నెటిజన్లు ఎత్తి చూపిన తర్వాత తన తప్పును సమీక్షించుకున్నానని, మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకున్నారు. దీంతో వివాదానికి  ముగింపు వచ్చినట్లయింది.

 

 

[Sampoornesh Babu, Sampoornesh Babu And Journalist Nagendra Kumar Issue,  Nani, Srikanth Odela, , The Paradise Worldwide Gross, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com