Home

»

Latest News

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ భావోద్వేగ పోస్ట్: మరి కీర్తి సురేష్ ఏం చేస్తుందో! 

Sep 25, 2026 11:27AM


కథకి తగ్గ టేకింగ్ తో సినిమాని సెల్యులాయిడ్ పై పరుగెత్హించడంలో దిట్ట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఇందుకు సౌత్ సినీ ప్రేక్షకుల మనస్సులో మెస్మరైజ్ చేస్తూ ఉన్న తన ప్రీవియస్ చిత్రాలే ఉదాహరణ. ఇప్పుడు తన 10వ చిత్రం 'డోరోథి' (Dorothy) తో ఈ నెల 25 న అంటే ఈ రోజు మరో సారి సెల్యులాయిడ్ ని వశం చేసుకోవడానికి వస్తున్నాడు 
 

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ, డోరోథిని  రూపొందించే క్రమంలో గడిపిన ప్రతి రోజూ నాలో  ఒక వ్యక్తిగా, దర్శకుడిగా, ఒక కళాకారుడిగా మరియు మనిషిగా ఎంతో మార్పు తెచ్చింది. నేను  ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటిలోనూ ఇది అత్యంత వాస్తవికమైనది. హృదయానికి ఎంతో దగ్గరైన కథ. 1990ల కాలంలో జరిగిన అనేక యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. సాధారణంగా ఈ తరహా వాణిజ్యేతర, భావోద్వేగ కథను మెయిన్‌స్ట్రీమ్ సినిమాలో చూపించాలనుకున్నప్పుడు చాలామంది "మీరు ఏ నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నారు?" అని నన్ను ప్రశ్నించేవారని, దానికి తన సమాధానం ఎప్పుడూ ఒక్కటేనని అది నా ప్రేక్షకులపై నాకున్న అపారమైన నమ్మకం.


ఇది కూడా చదవండి: సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం: క్షమాపణలు చెప్పాలని డిమాండ్..చెప్పేసారు!

 

 

ఒక చిన్న పిల్లవాడు తాను వేసిన మొదటి చిత్రాన్ని తన తల్లిదండ్రులకి  ఎంత ఉత్సాహంగా, ఆత్రుతగా చూపిస్తాడో, నేను కూడా అంతటి ఆరాటంతో డోరోథి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని సుబ్బరాజు చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటి కీర్తి సురేష్ నటించగా, సంనాత్ మరియు రిషికాంత్ కీలక పాత్ర పోషించారు. 2026 టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శితమై అంతర్జాతీయ స్థాయిలో స్టాండింగ్ ఓవేషన్ పొందిన డోరోథి, గత దశాబ్ద కాలంలో టిఫ్ ఫెస్టివల్‌కి ఎంపికైన మొదటి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. సంగీత దిగ్గజం ఇళయరాజా స్వరపరిచిన 1,540వ చిత్రంగా ఇది సరికొత్త మైలురాయిని చేరుకుంది. దాదాపు 146 నుంచి 150 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రాన్ని సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్స్, ధమ్మం ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

 

 

[karthik Subbaraj, karthik Subbaraj Emotional Note Dorothy Release,  Dorothy Tamil Movie,  Keerthy Suresh, Ilaiyaraaja, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com